విజయ్ దేవరకొండకు హిందీ హీరో కాంప్లిమెంట్!
Send us your feedback to audioarticles@vaarta.com
'అర్జున్‌రెడ్డి' అంటే విజయ్ దేవరకొండ... విజయ్ దేవరకొండ అంటే 'అర్జున్‌రెడ్డి' అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 'అర్జున్‌రెడ్డి' పాత్రలో విజయ్ దేవరకొండ జీవించాడు కాబట్టే సినిమా అంత ఘన విజయం సాధించింది. ప్రేక్షకుల్లో ఎక్కువశాతం మంది సినిమాను 'కల్ట్ క్లాసిక్'గా అభివర్ణిస్తున్నారు.
ఈ సినిమాను తమిళంలో 'వర్మ' పేరుతో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా దర్శకుడు బాల రీమేక్ చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్‌కి తెలుగులో 'అర్జున్‌రెడ్డి'కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల హిందీ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా హీరో షాహిద్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డికి విజయ్ దేవరకొండ విషెస్ తెలిపారు. అందుకు షాహిద్ కపూర్ బదులిస్తూ "బ్రదర్... సినిమాలో మీ పాత్ర ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఎన్ని రీమేకులు వచ్చినా మీరే ఒరిజినల్" అని ట్వీట్ చేశారు.
షాహిద్ కపూర్ స్పందనాకు విజయ్ దేవరకొండ ప్రతిస్పందిస్తూ "బిగ్ బ్రదర్... మీరంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ. మీరు, సందీప్ కలిసి మ్యాజిక్ చేస్తారు. మిమ్మల్ని కబీర్ సింగ్గా చూడాలని ఆతృతగా ఉంది" అన్నారు. తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాలో కథానాయికగా నటించిన కియారా అడ్వాణీ, 'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్ సరసన నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com