బాలీవుడ్ నటుడే ప్రభాస్ విలన్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. అందుకే ఇప్పుడు తన తదుపరి చిత్రం కూడా భారీ లెవల్లో రూపొందనుంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై రన్‌రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్`సాహో`. ఈ సినిమా టీజర్ అల్రెడి విడుదలైన సన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాలో ప్రస్తుతం హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. అలాగే విలన్‌గా విజయ్ కత్తి చిత్రంలో విలన్ నీల్ నితిన్ ముఖేష్ నటించబోతున్నాడట. బాలీవుడ్‌లో సినిమాపై అంచనాలు పెంచడానికి వీలుగా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే బాలీవుడ్ నటుడిని విలన్‌గా నటింప చేస్తున్నారని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com