Akhil Mishra:షూటింగ్‌లో ప్రమాదం .. 3 ఇడియట్స్ నటుడు మృతి, బాలీవుడ్ దిగ్భ్రాంతి

  • IndiaGlitz, [Thursday,September 21 2023]

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హిందీ నటుడు అఖిల్ మిశ్రా ప్రమాదవశాత్తూ కన్నుమూశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ బిల్డింగ్‌పై నుంచి అఖిల్ మిశ్రా కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయన తుదిశ్వాస విడిచినట్లు మిశ్రా సన్నిహితుడు ఖుల్వీందర్ భక్తి తెలిపారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్‌ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ సినిమాలో లైబ్రేరియన్ పాత్రలో అఖిల్ అద్భుతంగా నటించారు. ఆ తర్వాత డాన్, గాంధీ, మై ఫాదర్, శిఖర్ సహా పలు సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు సీఐడీ, ఉత్తరన్, ఉదాన్ వంటి టీవీ సీరియల్స్‌లోనూ అఖిల్ నటించారు.

జర్మన్ నటి సుజానే బెర్నార్డ్‌ను ప్రేమించి పెళ్లాడారు అఖిల్ మిశ్రా. 2009లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట అనంతరం 2011లో భారతీయ సాంప్రదాయ పద్దతిలో రెండోసారి పెళ్లి పీటలెక్కారు. ఆయన మరణంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు అఖిల్ మిశ్రా మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఇంతకీ అఖిల్ హైదరాబాద్‌లో ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడన్నది మాత్రం తెలియరాలేదు.

More News

జీ తెలుగు ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా అప్ సైకిల్డ్ గణేష్ నవరాత్రులు!

గణపతిబప్పా.. మోరియా’ అంటూ దేశమంతటా ఘనంగా జరుపుకొనే పండుగ ‘గణేష్ చతుర్థి’. వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులను కోలాహలంగా నిర్వహిస్తారు.

Nandamuri Balakrishna:అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య.. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్, బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన తెలిపారు.

Bigg Boss 7 Telugu : షర్ట్ విప్పేసిన గౌతమ్ .. ఛాలెంజ్ అంటూ శోభాశెట్టి విశ్వరూపం , పవర్ అస్త్ర కోసం శివాజీ దిగులు

బిగ్‌బాస్ 7 తెలుగులో పవర్ అస్త్ర కోసం ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Ysrcp MP:రిజర్వేషన్ లేకుండానే 50 శాతం పదవులు.. మహిళా సాధికారతే జగన్ లక్ష్యం : లోక్‌సభలో వైసీపీ ఎంపీలు

దశాబ్థాలుగా భారతీయ మహిళలు కన కల ఇన్నాళ్లకు నెరవేరింది.. అసాధ్యం అనుకున్న దానిని మోడీ షా ద్వయం సుసాధ్యం చేసి చూపించింది.

AP Students:ఐరాసలో ఏపీ విద్యార్ధులు.. ఆ ప్రసంగానికి దేశాధినేతలే ఫిదా, మన సర్కారీ బడులపై మేధావుల ప్రశంసలు

పేదవాడి తలరాతను మార్చేది విద్యేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ తరచుగా చెబుతూ వుంటారు. అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించారు.