'బోగన్' ఈ నెల 26 న ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా రాణిస్తున్న 'జయం' రవి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. తెలుగులో పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు నిర్మించిన సుప్రసిద్ధ సినీ నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడైన 'జయం' రవి నటించిన తమిళ హిట్ సినిమాలు తెలుగులో అనువాదమై మంచి విజయం సాధించాయి. అలాగే ఆయన తమిళంలో చేసిన కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి ఘన విజయం సాధించాయి.
ఉదాహరణకు అరవింద్‌స్వామి కాంబినేషన్‌తో 'జయం' రవి నటించిన 'తని ఒరువన్' (2015) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఆ సినిమాని తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్‌చచణ్ హీరోగా 'ధృవ' పేరుతో రీమేక్ చేయగా, ఇక్కడా సూపర్ హిట్టయింది. 'తని ఒరువన్' తర్వాత 'జయం' రవి, అరవింద్ స్వామి కాంబినేషన్‌లో రూపొంది సూపర్‌హిట్టయిన మరో సినిమానే ఈ 'బోగన్'. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని లక్ష్మణ్ డైరెక్ట్ చేశారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా తమిళంలో రూ. 25 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.
ఇప్పుడు 'బోగన్' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. ఇప్పటికే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎక్కడా అనువాద చిత్రమనే అభిప్రాయం కలగకుండా క్వాలిటీతో డబ్ చేశామని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు.
ఒక బ్యాంక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే విక్రమ్ అనే పోలీసాఫీసర్ కథ 'బోగన్' చిత్రం. తనకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఆదిత్యను ఒక అద్భుత ప్లాన్‌తో విక్రమ్ పట్టుకోవడం టెర్రిఫిక్ ఇంటర్వెల్ బ్లాక్. ఆ తర్వాత కథ ప్రేక్షకులు ఊహించని మలుపులు తిరిగి, అనుక్షణం కుర్చీలలో మునివేళ్లపై కూర్చోపెట్టేలా కథనం పరుగులు పెడుతుంది.
విక్రమ్ ఐపీఎస్‌గా జయం రవి, ఆదిత్యగా అరవింద్ స్వామి ఫెంటాస్టిక్‌గా నటించిన ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. హీరోయిన్‌గా హన్సికా మొత్వాని నటించిన ఈ చిత్రంలో నాజర్, పొన్‌వణ్ణన్, నరేన్, అక్షర గౌడ ఇతర పాత్రధారులు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
ఈ నెల 26 న చిత్రం ట్రైలర్ విడుదల అవుతుందని నిర్మాత తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
తారాగణం: జయం రవి, అరవింద్ స్వామి, హన్సికా మొత్వానీ, నాజర్, పొన్‌వణ్ణన్, నరేన్, అక్షర గౌడ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com