గంగానదిలో కరోనా మృతదేహాల గుట్టలు..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తోంది.. దీని కారణంగా మరణాలు ఏ స్థాయిలో ఉంటున్నాయనే దానికి ఈ వార్తే ఉదాహరణ. ఏ హాస్పిటల్ చూసినా కరోనా బాధితులతో కిటకిటలాడుతోంది. ఇంకా బెడ్ దొరికితే చాలని ఎదురు చూసే వారు ఎంతో మంది ఉన్నారు. ఇక మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. శ్మశానాలన్నీ శవాల గుట్టలతో నిండిపోతుంటడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకుంటున్నాయి. ఈ తరుణంలో చేసేదేమీ లేక వందల కొద్దీ శవాలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. గంగానది ఒడ్డు అంతా మృతదేహాలతో నిండిపోయింది.
Also Read: తిరుపతి రుయాలో ఘోరం.. 11 మంది ప్రాణాలు బలిగొన్న 15 నిమిషాలు!
మృతదేహాలను వీధి కుక్కలు పీక్కుతింటున్నాయి. శవాలన్నీ పకడ్బంధీ ప్యాకింగ్‌తో దర్శనమిస్తుండటంతో కరోనాతో మృతి చెందినవారేనని స్పష్టమవుతోంది. బిహార్‌లోని బక్సర్ జిల్లా చౌసా పట్టణంలో గంగా నది ఒడ్డున సోమవారం పొద్దున్నే ఈ దృశ్యం స్థానికులకు కనిపించింది. ఈ భీతావహ దృశ్యాలను చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ వార్త క్షణాల్లో దేశమంతా దావాణలంలా వ్యాపించింది. అయితే ఈ మృతదేహాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీయగా.. యూపీ నుంచే కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. యూపీలో వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. రోజుకు వందల కొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి. శ్మశానాల్లో అంత్యక్రియలకు సమయం, స్థలం ఉండటం లేదు. ఈ క్రమంలోనే నదిలో పడేస్తున్నారని తెలుస్తోంది.
ఈ ఒక్క కారణమే కాదు.. మృతదేహాలను నదిలో వదిలేసే సంప్రదాయం బిహార్‌లో లేదు. యూపీలోనే దాన్ని పాటిస్తారు. కాబట్టి శవాలన్నీ యూపీవేనని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇలా గంగా నదిలో విడిచిపెట్టిన వాటిలో 150 మృతదేహాలు సరిహద్దులోని చౌసా బ్లాక్‌లో గంగా నది ఒడ్డున కనిపించాయి. ప్రవాహం తగ్గడంతో మహదేవ్ ఘాట్ వద్ద ఒడ్డుకు చేరాయి. ఈ శవాలను వీధి కుక్కలు తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే కిట్ ధరించిన కొందరు వ్యక్తులు మృతదేహాలను గంగానదిలో విసిరేస్తున్న వీడియో కూడా వైరల్ అవతోంది. అధికారులు 15 శవాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మృతదేహాలు యూపీలోని బహ్రయిచ్, వారాణాసీ, అలహాబాద్ వాసులవి అయి ఉండొచ్చని అధికారి ఒకరు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments