మెగా హీరోను డైరెక్ట్ చేయనున్న బాబీ?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్‌లపై ఎప్పుడూ ఓ ఆసక్తికరం ఉండనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ రూపొందనుందని వార్తలు వినపడుతున్నాయి. ఆ కాంబినేషనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ). రీసెంట్‌గా వెంకీమామతో సక్సెస్ అందుకున్నాడు డైరెక్టర్ బాబీ. అంతకు ముందు బాబీ జై లవకుశతో మరో హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అల్లు క్యాంప్ నుండి బాబీకి పులుపు వచ్చిందట. ఈ డైరెక్టర్ ఇప్పుడు బన్నీ కోసం కథను సిద్ధం చేస్తున్నాడని టాక్.
ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్రాన్ని పూర్తి చేసిన బన్నీ తదుపరి సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాతనే బాబీ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కుతుందని వార్తలు వినపడుతున్నాయి. అయితే సుకుమార్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్ని `ఐకాన్` సినిమా చేస్తాడని వార్తలు వినిపించాయి. మరిప్పుడు దిల్‌రాజు, వేణుశ్రీరామ్ కాంబినేషన్‌లో బన్నీ చేయాల్సిన ఐకాన్ సినిమా ఆగిపోయిందా అనే వార్తలు వినపడుతున్నాయి మరి దీనిపై అటు దిల్‌రాజు క్యాంప్ కానీ.. ఇటు బన్నీ క్యాంప్ కానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com