మెగా హీరోను డైరెక్ట్ చేయనున్న బాబీ?

  • IndiaGlitz, [Wednesday,December 18 2019]

సినిమా రంగంలో కొన్ని కాంబినేష‌న్‌ల‌పై ఎప్పుడూ ఓ ఆస‌క్తిక‌రం ఉండ‌నే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేష‌న్ రూపొంద‌నుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ కాంబినేష‌నే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ). రీసెంట్‌గా వెంకీమామ‌తో సక్సెస్ అందుకున్నాడు డైరెక్ట‌ర్ బాబీ. అంత‌కు ముందు బాబీ జై ల‌వ‌కుశ‌తో మ‌రో హిట్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అల్లు క్యాంప్ నుండి బాబీకి పులుపు వ‌చ్చింద‌ట‌. ఈ డైరెక్ట‌ర్ ఇప్పుడు బ‌న్నీ కోసం క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ని టాక్‌.

ప్ర‌స్తుతం అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని పూర్తి చేసిన బ‌న్నీ త‌దుప‌రి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత‌నే బాబీ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే సుకుమార్ సినిమా త‌ర్వాత వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని 'ఐకాన్‌' సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. మ‌రిప్పుడు దిల్‌రాజు, వేణుశ్రీరామ్ కాంబినేష‌న్‌లో బ‌న్నీ చేయాల్సిన ఐకాన్ సినిమా ఆగిపోయిందా అనే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి మ‌రి దీనిపై అటు దిల్‌రాజు క్యాంప్ కానీ.. ఇటు బ‌న్నీ క్యాంప్ కానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

బ‌న్నీ టైటిల్‌తో బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

సైరాకు షాకిచ్చిన ప్ర‌భుత్వాలు!!

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరు 151వ చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.200కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది.

'ఇద్దరి లోకం ఒక‌టే' ట్రైల‌ర్ విడుద‌ల‌

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇద్దరి లోకం ఒకటే'.

ఏపీలో 3 రాజధానుల వెనుక వ్యూహమిదేనా!?

వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి పరిస్థితేంటి..? అని నాటి నుంచే రాజధానికి భూములిచ్చిన, పరిసర ప్రాంతాల రైతులు ముఖ్యంగా

మేడ‌మ్ టుస్సాడ్స్‌లో కాజ‌ల్ విగ్ర‌హం

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి అరుదైన గౌర‌వం ద‌క్కుతుంది. ఇంత‌కు ఆమెకు ద‌క్కుతున్న గౌర‌వ‌మేమిటంటే..