'బ్లఫ్ మాస్టర్' రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్ధాలు జరుగుతాయి. అత్యాశపరులను టార్గెట్ చేసే ఓ వ్యక్తి కథతో తమిళంలో తెరకెక్కిన చిత్రం `చతురంగ వేట్టై`. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో `బ్లఫ్ మాస్టర్` పేరుతో రీమేక్ అవుతోంది. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. గోపీ గణేష్ పట్టాభి దర్శకుడు. `జ్యోతిలక్ష్మి`, `ఘాజి` చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు .
`ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక. ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 28న విడుదల చేయాలని యూనిట్ అనుకుంది. కానీ ఆలస్యమైంది. తాజాగా సినిమాను డిసెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com