Sena vs Sena Case : ఉద్ధవ్ థాక్రేకు షాకిచ్చిన సుప్రీం.. ఈసీకే అధికారం, సంబరాల్లో షిండే వర్గం
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్రకు చెందిన ప్రాంతీయ పార్టీ శివసేనపై హక్కుల విషయంగా సీఎం ఏక్నాథ్ షిండేకు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేల మధ్య యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్ట్ వరకు వెళ్లగా... ఉద్ధవ్‌కు షాక్ తగిలింది. అసలైన శివసేన ఎవరిదో నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానిదేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అసలేంటీ వివాదం:
కాగా.. ఈ ఏడాది జూన్‌లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భారీ ట్విస్టులు, నాటికీయ పరిణామాల మధ్య బీజేపీ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు షిండే. తొలుత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని అంతా భావించారు. కానీ కమలనాథులు వ్యూహాత్మకంగా షిండేను సీఎంను చేసి డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రి పదవులను పొందారు. తర్వాత శివసేనను పూర్తిగా సొంతం చేసుకోవాలని భావించిన ఏక్నాథ్ షిండే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తమదే అసలైన శివసేన అంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. పార్టీపై నియంత్రణ, శివసేన గుర్తు తమకే కేటాయించాలని కోరింది. వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించిన ఉద్ధవ్ థాక్రే... ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు విచారణ పరిధిలో వున్నందున అవి తేలేవరకు షిండే విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకోవద్దని కోరారు.
ఈసీ నిర్ణయం ఏంటో:
కానీ థాక్రే చేసిన విజ్ఞప్తిని ఈసీ పక్కనపెట్టేసింది. శివసేన ఎన్నికల గుర్తు తమదేనని నిరూపించేలా అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలని ఇరువర్గాలకు సూచించింది. దీంతో ఉద్ధవ్ సుప్రీం మెట్లెక్కారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈసీ దూకుడుకు బ్రేక్ వేసింది. ఇవాళ జరిగిన తాజా విచారణలో మాత్రం శివసేన పార్టీ, విల్లు, బాణం గుర్తులు ఎవరికి కేటాయించాలనే అంశాన్ని ఈసీయే నిర్ణయిస్తుందని చెబుతూ.. ఉద్ధవ్ థాక్రే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout