పవన్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్... డీజే బాక్స్‌లు బద్దలే
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘‘భీమ్లా నాయ్’’. సంక్రాంతి కానుకగా జనవరి 12న తొలుత రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే దీనికి ముందు వెనుకా రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానుండటంతో చిత్ర పరిశ్రమ, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25కి భీమ్లా నాయక్ వాయిదా పడింది. ఈ నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. సంక్రాంతికి తమ హీరో సినిమా చూద్దామనుకున్న ఫ్యాన్స్ నిరాశకు లోనవ్వడంతో వారిని ఖుషీ చేసేందుకు మేకర్స్ ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఫ్యాన్స్ న్యూ ఇయర్ సంబరాల కోసం భీమ్లా నాయక్ లోని '' లా లా భీమ్లా..' సాంగ్ డీజే వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం 7:02 నిమిషాలకు లా లా భీమ్లా డీజే వర్షన్ విడుదల చేయనున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ ఆరోజు రాత్రి నూతన సంవత్సర సంబరాల్లో 'లా లా భీమ్లా..' సాంగ్ డీజే వర్షన్‌తో మోతమోగించనున్నారు.
ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తున్నారు. ఇటీవలే వికారాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments