బ్లాక్ ఫంగస్ రావడానికి ఆ నీరే కారణం..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా యావత్ భారతదేశం అల్లాడుతుంటే.. ఇది చాలదన్నట్టు బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) కూడా వచ్చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్నాటకతో పాటు తెలంగాణలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా.. మరి కొందరు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఈ వ్యాధి సోకుతుండటం గమనార్హం. ఇప్పటికే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి తదితర జిల్లాలకు చెందిన పలువురు బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు.
Also Read: కొవిడ్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన డీఆర్‌డీవో
బ్లాక్ ఫంగస్ లక్షణాలు
బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కళ్లు ఎర్రబడటం, కళ్ల చుట్టూ నొప్పి, జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపు వాంతులు, మానసిక స్థితిపై ప్రభావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మ్యూకస్ వల్ల ముక్కు బ్లాక్ అయినంత మాత్రాన... అలాంటి కేసులన్నీ బాక్టీరియల్ సైనసటిస్‌గా భావించవద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ చికిత్స తీసుకునే పేషెంట్లకు... చికిత్సలో భాగంగా రోగ నిరోధక శక్తిని తాత్కాలికంగా అణచివేసే లేదా క్రమబద్దీకరించేలా కొన్ని రకాల డ్రగ్స్ ఇస్తారు. ఇవి తీసుకున్నవారిలో ముక్కు బ్లాక్ అవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాంటి కేసులను బ్యాక్టీరియల్ సైనసటిస్‌గా భావించవద్దని నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ ఫంగస్ ఎందుకొస్తుంది?
బ్లాక్ ఫంగస్ ఎందుకొస్తుందో తాజాగా నిపుణులు వివరించారు. ఆక్సిజన్ అందించేటపుడు స్టెరైల్ నీటికి బదులు సాధారణ నీటిని హ్యుమిడిఫయర్ ద్వారా అందించడం కూడా బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై అహ్మదాబాద్‌కు చెందిన హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్ అతుల్ అభ్యంకర్ మాట్లాడుతూ.. హ్యుమిడిఫయర్లే దీనికి ప్రధాన కారణమన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారు సాధారణ నల్లా నీటిని వాడేస్తున్నారని.. అందులో రకరకాల సూక్ష్మజీవులుంటాయని వాటి కారణంగానే శరీరంలో ఫంగస్ ఏర్పడుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు హ్యుమిడిఫయర్‌ను శుభ్రం చేస్తూ ఉండాలని డాక్టర్ అతుల్ సూచించారు. అలాగే కొవిడ్ చికిత్సలో వాడుతున్న స్టెరాయిడ్స్ కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com