చిరుపై బీజేపీ మహిళా నేత తీవ్ర విమర్శలు!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం విదితమే. చిరు, నాగార్జున, దగ్గుబాటి సురేష్, దిల్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు జగన్‌తో భేటీ అయ్యి.. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా, టీవి సీరియల్స్ నిర్మాణంతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించుకున్నారు. అనంతరం మెగాస్టార్ చిరు కూడా మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. భేటీకి ముందే జేఏసీ మహిళా నేత, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ నాయకురాలు సాధినేని యామిని ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోలపై దుమ్మెత్తి పోశారు.
నాటి నుంచి నేటి వరకూ..
ఏపీ రెండుగా విడిపోయిన తర్వాత నుంచి నెలకొన్న పరిస్థితులన్నీ చెబుతూ.. నాటి నుంచి నిన్న మొన్న జరిగిన విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన వరకూ సినీ ఇండస్ట్రీ వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదన్నట్లుగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా చిరును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ‘సినిమా నటులకు వాళ్ల స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమై పోయాయి. ప్రజల సమస్యలు పట్టడం లేదు. హీరోలు వారి స్వార్థం కోసమే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చినా, ఇండస్ట్రీ పెద్దలెవరూ స్పందించలేదు. తెలుగు రాష్ట్రాల్లో కలకం విశాఖపట్నంలో గ్యాస్ లీకయ్యి 13 మంది మరణించినా, ఒక్క హీరో కూడా స్పందించలేదు. వారిని సమాజమే సెలబ్రిటీలను చేసింది. అలాంటి సమాజం ఆశలు, ఆకాంక్షలపై వారెవరు స్పందించడం లేదు. ఇది చాలా దారుణం. రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేస్తున్న ఆందోళనలపై చిరంజీవి ఏ రోజూ స్పందించలేదు’ అని యామినీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా సీఎం జగన్ అనుకున్న మూడు రాజధానులకు చిరు జై కొట్టిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com