నో డౌట్.. బీజేపీ భారీ మెజార్టీ సాధిస్తుంది!
Send us your feedback to audioarticles@vaarta.com
దేశమంతటా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. కచ్చితంగా బీజేపీ పక్షాలకు 300 సీట్లు రావడం ఖాయమని స్పష్టం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రజలు మరోసారి మెజార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారని చెప్పారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చేపట్టిన ప్రచారం చారిత్మాత్మకమైందన్నారు. కాగా.. ఇవాళ్టితో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ జాతీయాధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. అమిత్ షా, మోదీ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాగా.. ప్రధాని మోదీ ఐదేళ్ల పాలనలో మీడియా ముందుకు రావడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
భారీ మెజార్టీతో..!
2014లో చారిత్రక తీర్పుతో అధికారంలో వచ్చామని.. పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014లో మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అవినీతి నిర్మూలనకు తీసుకున్న చర్యలు బీజేపీని గెలిపిస్తాయని షా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పేదలు, రైతులు, పేదలు, మహిళల సక్షేమంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన సాగేలా ఈ ఐదేళ్లు ప్రధానంగా దృష్టిసారించామన్నారు.
మాకు నమ్మకముంది!
"ఎన్నికలు జరుగుతున్నాయని ఐపీఎల్‌ను విదేశాలకు తరలించాల్సిన పరిస్థితి లేదు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యమని గర్వంగా చెప్పగలను. సోషల్ మీడియా వచ్చాక, బాధ్యత రెట్టింపయ్యింది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టాం. బీజేపీకి ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మా పథకాలు పక్కా ప్రణాళిక రూపొందించినవి. జనవరి 16 నుంచి ఎన్నికల ప్రచారాన్ని తాము చేపట్టాం. గత ఎన్నికల్లో గెలుచుకోలేకపోయిన 120 లోక్‌సభ స్థానాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించాము. మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం మాకుంది" అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com