బీజేపీ,టిడిపి, జనసేన దోస్తీ... 2024లో కలిసి బరిలోకి
- IndiaGlitz, [Monday,September 02 2019]
టిడిపి,బీజేపీ, జనసేనలు 2024 లో జరిగే ఎన్నికల్లో దోస్తీ కట్టి... పోటీకి దిగుతాయని తెలిపారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ప్రధాని మోడీ జమిలి ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారని... సార్వత్రిక ఎన్నికలు ముందే వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఆ సమయానికి భారీగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా... ఈ వ్యాఖ్యలు బీజేపీ, జనసేన లు టీడీపీతో తెరవెనుక దోస్తీ కడుతున్నాయి అన్న అనుమానాలకు బలం చేకూర్చింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన జనాసేనాని పవన్ కళ్యాణ్.... 2019 ఎన్నికల్లోనూ పరోక్షంగా మద్దతు ఇచ్చారని అనుకున్నారు అంతా.
పైగా బాబు కొడుకు లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని పోటీకి నిలబెట్టక పోవడం... ఇది నిజమే అనేలా చేసింది. ఇదిలా ఉంటే టిడిపి ఘోర పరాజయం పాలయ్యాక... టిడిపి ఎంపీలు బీజేపీలో చేరడం వెనుక కూడా రాజకీయ దోస్తాని ఉందనే అనుమానాలు రేకెత్తించాయి. బాబును అవినీతి కేసుల నుంచి కాపాడేందుకే .. ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అని చర్చలు జరిగాయి కూడా. ఇప్పుడు అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు ఈ ట్రయంగిల్ ఫ్రెండ్షిప్ నిజమే అని తెలుస్తుంది.