మాజీ మంత్రి మోత్కుపల్లికి కరోనా.. పరిస్థితి విషమం
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి దినం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ మహమ్మారి రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఎందరో రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సెకండ్ వేవ్ బారిన పడి ఎందరో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సైతం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
రెండు రోజుల క్రితం మోత్కుపల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే మోత్కుపల్లిని కుటుంబ సభ్యులు సోమాజీగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. టీడీపీ హయాంలో మోత్కుపల్లి మంత్రిగా పని చేశారు. విభజనానంతరం ఆయన అధినేత చంద్రబాబుతో విభేదించి ఆ పార్టీని వదిలేశారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments