మాజీ మంత్రి మోత్కుపల్లికి కరోనా.. పరిస్థితి విషమం

  • IndiaGlitz, [Sunday,April 18 2021]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి దినం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ మహమ్మారి రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఎందరో రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సెకండ్ వేవ్ బారిన పడి ఎందరో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సైతం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

రెండు రోజుల క్రితం మోత్కుపల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే మోత్కుపల్లిని కుటుంబ సభ్యులు సోమాజీగూడ‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. టీడీపీ హయాంలో మోత్కుపల్లి మంత్రిగా పని చేశారు. విభజనానంతరం ఆయన అధినేత చంద్రబాబుతో విభేదించి ఆ పార్టీని వదిలేశారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు.

More News

‘కరోనా టీకాతోనే నటుడు వివేక్ మృతి’

కరోనా టీకా కారణంగానే ప్రముఖ నటుడు వివేక్ మ‌ృతి చెందారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశారు.

సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన నటుడు నరేష్

ప్రముఖ సినీ నటుడు సీనియర్ నరేష్.. స్టోన్ ఇన్‌ఫ్రా కంపెనీ యజమానిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

B.కాంలో ఫీజిక్స్" ట్రైలర్ ను విడుదల చేసిన  ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి

రెడ్ కార్పెట్ రీల్ ప్రొడక్షన్ పతాకంపై అంకిత, అవంతిక, మేఘన,నగరం సునీల్,జబర్దష్ అప్పారావు నటీ నటులుగా సామ్ జె చైతన్య స్వీయ దర్శకత్వంలో

మళ్లీ లాక్‌డౌన్ భయం.. ఇంటి బాట పడుతున్న వలస కూలీలు

మాయదారి కరోనా రెట్టింపు వేగంతో విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది లక్ష కేసులంటేనే జనం భయపడ్డారు.

టాలీవుడ్‌లో విషాదం.. పూజా ఎమోషనల్ ట్వీట్

టాలీవుడ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కో డైరెక్టర్ సత్యం కన్నుమూశారు.