BJP:12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ
- IndiaGlitz, [Tuesday,November 07 2023]
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత అభ్యర్ధుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 12 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. ఈ జాబితాలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుకు నిరాశ ఎదురైంది. ఆయన తనయుడు వికాస్ రావు వేములవాడ నుంచి టికెట్ ఆశించగా.. తుల ఉమకు అవకాశం కల్పించింది. ఇక ఇటీవల పార్టీలో చేరిన సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి టికెట్, చలమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు టికెట్‌ను కేటాయించింది.
12 మంది అభ్యర్థులు..
చెన్నూరు - దుర్గం అశోక్
ఎల్లారెడ్డి - వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
వేములవాడ - తుల ఉమ
కొడంగల్ - బంటు రమేష్ కుమార్
సిద్ధిపేట - దూది శ్రీకాంత్ రెడ్డి
నకిరేకల్ - నకరకంటి మొగులయ్య
గద్వాల - బోయ శివ
మిర్యాలగూడ - సాదినేని శ్రీనివాస్
ములుగు - అజ్మీరా ప్రహ్లాద్ నాయక్
హుస్నాబాద్ - బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి
మునుగోడు - చలమల్ల కృష్ణారెడ్డి
వికారాబాద్ - పెద్దింటి నవీన్ కుమార్
బీజేపీ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 52 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. రెండో విడతలో ఒక్కరి పేరు మాత్రమే ప్రకటించింది. మూడో విడతలో 35 మందితో అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా నాలుగో విడతలో 12మందితో జాబితాను అనౌన్స్ చేసింది. నాలుగు విడతల్లో మొత్తం 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాల్లో జనసేనతో పొత్తు నేపథ్యంలో ఇప్పటికే 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. జనసేన మాత్రం అంతకంటే ఎక్కువ స్థానాలు కోరుతుంది. ఇవాళ హైదరాబాద్‌లో జరగనున్న ప్రధాని మోదీ పర్యటన తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.