బి.జె.పి తరుపున రజనీకాంత్ ప్రచారం..
- IndiaGlitz, [Thursday,March 31 2016]
సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళనాడులో ఎలాంటి క్రేజ్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన అభిమానులు, సన్నిహితులు రాజకీయాల్లోకి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా మౌనంగానే ఉన్నారు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించలేదు. అన్ని పార్టీల నాయకులు రజనీకాంత్ కు సన్నిహితులే. అందుచేత ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు...ప్రచారం కూడా చేయలేదు. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బి.జె.పి తరుపున సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రచారం చేయనున్నారట. ఈ విషయాన్ని బి.జె.పి అధికారికంగా ప్రకటించింది. మూడు ప్రధాన వేదిక నుంచి ప్రసింగించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీథరరావు రజనీకాంత్ ని ఒప్పించారట. వివిధ పీఠాధిపతులు, స్వాములు ప్రచారంలో పాల్గొంటున్నట్టు తెలియచేసారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో రజనీకాంత్ కు పార్టీ తీర్ధం ఇప్పించాలని బి.జె.పి ప్రయత్నించింది. కానీ కుదరలేదు. ప్రధాని నరేంద్రమోదీ చెన్నై వెళ్లినప్పుడు రజనీకాంత్ ని ఇంటికి వెళ్లి కలిసారు. అది స్నేహపూర్వక భేటియే అని రజనీకాంత్ చెప్పారు. కానీ..ఇప్పుడు బి.జె.పి తరుపున ప్రచారం చేయనున్నారు. మరి...రజనీకాంత్ బి.జె.పి కి ప్రచారం చేస్తే...తమిళనాడులో మిగిలిన పార్టీల పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. రజనీ ప్రచారం తమిళనాడు ఓటర్ల పై ఎంత వరకు ప్రభావితం చూపిస్తుందో..? ఎవర్ని సి.ఎం కుర్చీ పై కూర్చోబెడుతుందో..?