బీజేపీ వాళ్లు అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారు: సిద్దార్థ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు సిద్దార్థ్‌కు తమిళనాడుకు చెందిన బీజేపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సిద్దార్థ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా బీజేపీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ నేతలు సైతం ఆయనతో సోషల్ మీడియాలోనే మాటల యుద్ధానికి దిగుతున్నారు. అయినప్పటికీ సిద్దార్థ్.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు.
సిద్దార్థ్ ఏమాత్రం లొంగేలా లేడనుకున్నారో ఏమో గానీ ఇక బెదిరింపులకు దిగారు. ఆయననే కాదు.. ఆయన కుటుంబ సభ్యులను సైతం టార్గెట్ చేస్తూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నారని సిద్దార్థ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. తన ఫోన్ నంబర్‌ను బీజేపీ నేతలు లీక్ చేశారని చెబుతున్నాడు. ‘‘తమిళనాడు భాజపాకు చెందిన కొంతమంది నా ఫోన్ నంబర్‌ని లీక్ చేశారు. సుమారు 500 ఫోన్‌కాల్స్.. అందరూ నన్ను తిడుతున్నారు. నన్ను, నా కుటుంబసభ్యులను అత్యాచారం, హత్య చేస్తామంటూ గడిచిన 24 గంటల నుంచి నన్నుబెదిరిస్తున్నారు. ఆ ఫోన్ నంబర్లు, వాళ్లు మాట్లాడిన రికార్డింగ్స్ అన్నింటినీ భద్రపరిచా(బీజేపీ లింక్స్, డీపీలతో). వాటిని పోలీసులకు అందిస్తున్నా. నేను ఏమాత్రం తగ్గేదే లేదు. కావాలంటే ట్రై చేసుకోండి’’ అని సిద్దార్థ్ తెలిపాడు.
గత శనివారం కూడా సిద్దార్థ్ ప్రధాని మోదీ ట్వీట్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ‘‘భారత్‌కు ప్రస్తుత తరుణంలో చాలా బలమైన ప్రభుత్వం అవసరం. మోదీ అనే వాడు పెద్ద విషయమే కాదు. నేను నా పాత జీవితంలోకి వెళ్లి ఒక టీ స్టాల్‌ను ఓపెన్ చేయగలను. కానీ దేశం ఏమాత్రం ఇబ్బంది పడకూడదు’’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి హీరో సిద్దార్థ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఈ మనిషి చెప్పిన ప్రతి ఒక్క విషయంతో నేను ఏకీభవిస్తున్నా. మీరు ఏకీభవించగలరా..?’’ అని నెటిజన్లను సిద్దార్థ్ ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments