బీజేపీ వాళ్లు అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారు: సిద్దార్థ్

  • IndiaGlitz, [Friday,April 30 2021]

ప్రముఖ నటుడు సిద్దార్థ్‌కు తమిళనాడుకు చెందిన బీజేపీ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సిద్దార్థ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా బీజేపీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ నేతలు సైతం ఆయనతో సోషల్ మీడియాలోనే మాటల యుద్ధానికి దిగుతున్నారు. అయినప్పటికీ సిద్దార్థ్.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు.

సిద్దార్థ్ ఏమాత్రం లొంగేలా లేడనుకున్నారో ఏమో గానీ ఇక బెదిరింపులకు దిగారు. ఆయననే కాదు.. ఆయన కుటుంబ సభ్యులను సైతం టార్గెట్ చేస్తూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నారని సిద్దార్థ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. తన ఫోన్ నంబర్‌ను బీజేపీ నేతలు లీక్ చేశారని చెబుతున్నాడు. ‘‘తమిళనాడు భాజపాకు చెందిన కొంతమంది నా ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారు. సుమారు 500 ఫోన్‌కాల్స్‌.. అందరూ నన్ను తిడుతున్నారు. నన్ను, నా కుటుంబసభ్యులను అత్యాచారం, హత్య చేస్తామంటూ గడిచిన 24 గంటల నుంచి నన్నుబెదిరిస్తున్నారు. ఆ ఫోన్‌ నంబర్లు, వాళ్లు మాట్లాడిన రికార్డింగ్స్ అన్నింటినీ భద్రపరిచా(బీజేపీ లింక్స్, డీపీలతో). వాటిని పోలీసులకు అందిస్తున్నా. నేను ఏమాత్రం తగ్గేదే లేదు. కావాలంటే ట్రై చేసుకోండి’’ అని సిద్దార్థ్‌ తెలిపాడు.

గత శనివారం కూడా సిద్దార్థ్ ప్రధాని మోదీ ట్వీట్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ‘‘భారత్‌కు ప్రస్తుత తరుణంలో చాలా బలమైన ప్రభుత్వం అవసరం. మోదీ అనే వాడు పెద్ద విషయమే కాదు. నేను నా పాత జీవితంలోకి వెళ్లి ఒక టీ స్టాల్‌ను ఓపెన్ చేయగలను. కానీ దేశం ఏమాత్రం ఇబ్బంది పడకూడదు’’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి హీరో సిద్దార్థ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఈ మనిషి చెప్పిన ప్రతి ఒక్క విషయంతో నేను ఏకీభవిస్తున్నా. మీరు ఏకీభవించగలరా..?’’ అని నెటిజన్లను సిద్దార్థ్ ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

More News

ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ గుండెపోటుతో మృతి

ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌(54) మృతి చెందారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు ఆయనకు గుండెపోటు రావడంతో క‌న్నుమూశారు.

కేసీఆర్ ఏం కీలక ప్రకటన చేస్తారో.. టెన్షన్.. టెన్షన్..!

సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు మిశ్రమ ఫలితాన్నిచ్చాయి. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు.

టీఎస్‌పీఎస్‌సీని క్లోజ్ చేయాలనుకుంటున్నారా?: హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ పబ్లిక్ కమిషన్‌కి 4 వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కూకట్‌పల్లి ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు..

ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి డబ్బులను దోచుకెళ్లిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగింది.

సాయం అందించాలని సోనూసూద్ పిలుపునకు విశేష స్పందన

లాక్‌డౌన్ మొదలు చేతికి ఎముక లేదన్నట్టుగా కష్టాల్లో ఉన్న జనానికి సాయం అందిస్తూ వస్తున్న ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ప్రస్తుతం సాయం కోసం అర్థిస్తున్నారు.