ఏపీ రాజధాని నిర్మాణంపై బాంబ్ పేల్చిన బీజేపీ ఎంపీ!

  • IndiaGlitz, [Sunday,August 25 2019]

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం అసలు అక్కడే ఉంటుందా..? లేకుంటే తరలింపు ఉంటుందా..? అనేదానిపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో రాజధాని రైతులు, ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే బొత్స అలా నోరు జారేడేమో అనుకుంటే.. మళ్లీ మళ్లీ అదే మాట మాట్లాడటంతో రాజధాని రైతుల్లో మరింత ఆందోళన పెరిగింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఇంతవరకూ స్పందించి క్లారిటీ ఇవ్వకపోవడం.. మరోవైపు మీడియాలో వరుస కథనాలు పుంకాలు పుంకాలుగా వస్తుండటంతో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియని ఏపీ ప్రజలు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

ఆశలు వదులుకోవాల్సిందే..

అయితే తాజాగా.. టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీజీ వెంకటేష్.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చి ఉన్నట్టుండి బాంబు పేల్చారు. అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. అంతటితో ఆగని ఆయన.. ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని సడన్ ట్విస్ట్ ఇచ్చారు.

ఆ నాలుగు ప్రాంతాల్లోనే..!

కాషాయ కండువా కప్పుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత ఓ టీవీ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడిన టీజీ పై వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని విజయనగరం, గుంటూరు, కాకినాడ, కడప జిల్లాలను రాజధానులుగా ప్రొజెక్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయం బీజేపీ అధిష్ఠానమే తనకు తెలియజేసిందని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ యోచన బట్టి నవ్యాంధ్రకు ఒకటి కాకుండా నాలుగు రాజధానులు ఉండే అవకాశం ఉందన్నారు. అయితే పోలవరం టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. పోలవరాన్ని జగన్ నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిన వారవుతారని జోస్యం చెప్పారు.

అసలేం జరుగుతోంది.. జగన్ క్లారిటీ ఇస్తారా..!?

ఇదిలా ఉంటే ఇటీవలే మీడియా ముందుకు ఒకసారి కాదు రెండుసార్లు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి మాత్రం తనకేమీ తెలియదన్నట్లుగా మాట్లాడటం.. టీజీ మాత్రం అంతా తనకు తెలుసని మాట్లాడటంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. సోమవారం నాడు వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెళ్తుండటంతో.. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడి రాజధాని వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్ ఏం ప్రకటన చేస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

More News

నాగార్జునకు అస్వస్థత.. అసలేమైంది.. నిజమేనా!?

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

మళ్లీ మళ్లీ.. బొత్స నోట అదే మాట.. అసలేంటి కథ!?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే. బొత్స మాటలతో అటు రాజధాని రైతులు,

యమునా నది తీరంలో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు

కమల దళంలో ట్రబుల్‌ షూటర్‌‌, కేంద్ర మాజీ మంత్రి, మోదీ-షాలకు రైట్ హ్యాండ్‌గా పేరుగాంచిన అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు నేడు 2:30 గంటలకు యమునానది తీరంలోని నిగంబోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.

‘సాహో’ స్టోరీ తెలిసిపోయిందోచ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆగస్టు 30న అభిమానుల ముందుకు రాబోతోంది.

అక్బరుద్దీన్ పైకిపోతేనే బెటర్.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు.