తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: బీజేపీకి షాక్.. సభ నుంచి ఈటల, రాజాసింగ్, రఘునందన్‌లు సస్పెండ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజే బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావులు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడుతున్నారన్న కారణంగా ఈ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసే వరకు ఈ ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. అటు ప్రభుత్వ తీరుపై ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేయలేరని.. తమను ఎంతగా అణచివేయాలనుకున్నా తాము అంతగానే ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద వీరు ముగ్గురు అమరవీరులకు నివాళులర్పించి అనంతరం అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తాము మాట్లాడకుండా అసెంబ్లీలో మైకులు కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాకముందు గతంలో కేసీఆర్ గంటల తరబడి మాట్లాడారని, సీఎం అయ్యాక ఇప్పుడు నియంతగా వ్యవహరిస్తున్నారని ఈటల ఫైర్ అయ్యారు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ ప్రారంభించడం ఏంటని నిలదీశారు. 50 ఏళ్ల నుంచి సంప్రదాయంగా వస్తున్న విధానాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోన్న కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments