జార్జిరెడ్డి వివాదం: రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జార్జ్‌రెడ్డి’. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నవంబర్ 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో ఎప్పుడూ.. ఎక్కడా లేని వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి. అయితే ఈ వివాదాలు యాదృచ్చికంగా జరుగుతున్నాయా..? లేకుంటే చిత్ర యూనిటే సృష్టిస్తోందా..? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ వివాదాలు కాస్త రాజకీయ మలుపు తిరిగింది. ఈ వివాదంపై తెలుగు రాష్ట్రాలకు ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు.
100% రియాక్షన్ వుంటుంది
సినిమా ఒక వర్గానికి చెందిన వారినే హైలైట్ చేస్తున్నారని.. మొత్తమ్మీద వన్‌సైడ్ మాత్రమే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. నిజానిజాలు చూపించకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని దర్శకనిర్మాతలు రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏబీవీపీని కించపరిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జార్జిరెడ్డి హత్య సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన మరోసారి గుర్తు చేశారు. అసలు ఏబీవీపీకి జార్జిరెడ్డి హత్యకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఏబీవీపీకి చెందిన వ్యక్తులు ఈ హత్య చేశారన్నట్టుగా ఈ మూవీలో చూపిస్తున్నారని మండిపడ్డారు. సినిమాల్లో నిజానిజాలు కాకుండా కల్పితాలు చేసి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ‘హండ్రెడ్ పర్సంట్ రియాక్షన్ వుంటుంది’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై పలు వివాదాలు చెలరేగగా.. తాజాగా రాజకీయ నేతలు సైతం రియాక్ట్ అవుతున్నారు. పరిస్థితి మాత్రం క్రిటికల్‌గానే ఉంది. సినిమా రిలీజ్ అయితే వాస్తవ పరిస్థితులేంటి అనేది తెలుస్తుంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments