Raghunandan Rao : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం హైదరాబాద్ నుంచి గజ్వేల్ వస్తుండగా హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రఘునందన్‌ను ఆల్వాల్ పీఎస్‌కు తరలించారు.
సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో రెండు రోజుల క్రితం హిందూ ముస్లింల మధ్య వివాదం చెలరేగింది. పడిచేడ్ రోడ్‌లో వున్న ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. క్షణాల్లో ఈ విషయం పట్టణమంతా పాకడంతో హిందువులు ఆందోళనకు దిగారు. అంతేకాదు.. మూత్ర విసర్జనకు పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీగా విగ్రహం వద్దకు వస్తుండగా.. ఓ ఇద్దరు వ్యక్తులపై మరో వర్గానికి చెందిన ఇద్దరు దాడికి దిగారు.
దీంతో హిందూ సంఘాలు మంగళవారం గజ్వేల్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి.అయినప్పటికీ ఉద్రిక్త పరిస్ధితులు చల్లారకపోగా.. మసీదుపై కొందరు వ్యక్తులు జెండాలు విసరడంతో మరింత అగ్గిరాజుకుంది. వివాదం మరింత పెద్దదయ్యేలా వుండటంతో సీపీ రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ క్రమంలో తొలుత దాడిలో గాయాలపాలైన సందీప్ అనే వ్యక్తిని పరామర్శించేందుకు రఘునందన్ రావు గజ్వేల్ బయల్దేరారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎమ్మెల్యే పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout