పవన్‌‌ కల్యాణ్‌పై బీజేపీ ఎమ్మెల్యేకు అనుమానం!

  • IndiaGlitz, [Tuesday,January 22 2019]

గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అసలు ఎవరు ఎవరితో పొత్తుకు రెడీ అవుతున్నారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా జనసేన పార్టీ ‘ఆ గట్టునుండాలో.. ఈ గట్టునుండాలో’ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. 2019 ఎన్నికల్లో కచ్చితంగా తాను ఒంటరిపోరాటం చేస్తున్నట్లు ఆయన ప్రకటించినప్పటికీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్- వైసీపీ అధినేత జగన్ భేటీతో సీన్ రివర్స్ అయ్యిందని సమాచారం. ఈ భేటీ రెండ్రోజుల ముందు నుంచే పవన్ వ్యవహారాన్ని చూస్తే తమకు అనుమానాలు వస్తున్నాయంటూ పలువురు నేతలు మీడియా ముందుకొచ్చి దుమారం రేపుతున్నారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో టీడీపీ నేతలెవ్వరూ పవన్‌‌ను విమర్శించొద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్.. పవన్‌‌పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

నేను పార్టీ మారట్లేదు..!
వైసీపీ అధినేత జగన్ విశాఖ పాదయాత్రలో విష్ణు పార్టీలో చేరతారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన వార్తలను ఖండించినప్పటికీ తాజాగా మరోసారి పుకార్లు గుప్పుమన్నాయి. దీంతో మీడియా ముందుకొచ్చిన విష్ణు తాను పార్టీ మారట్లేదని.. కొందరు కావాలనే ఇలా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది నేతలు పార్టీ మారినంత మాత్రాన మా పార్టీ ఖాళీ అవ్వదని.. 40 లక్షల మంది సభ్యులున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

పవన్‌‌పై అనుమానాలు ఇవీ..
బీజేపీ అంటే జగన్‌, పవన్‌ అని విమర్శించిన టీడీపీ... ఇప్పుడు పవన్‌ను తీసేసి కేసీఆర్‌ను చేర్చడంతో ఎందుకో అనుమానాలొస్తున్నాయన్నారు. తెలుగు తమ్ముళ్లు పవన్ కల్యాణ్‌‌ను విమర్శించడం మానేశారని.. దీంతో పవన్‌ గాలి కూడా కాస్త మారినట్లు కనిపిస్తోందని విష్ణు అనుమానం వ్యక్తం చేశారు. పవన్‌‌ కూడా గత కొద్దిరోజులుగా టీడీపీని పట్టించుకోవట్లేదన్నారు. ఒకప్పుడు మోదీ చేతుల్లో పవన్‌ ఉన్నాడని చెప్పిన ఇదే టీడీపీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకుందని.. ట్విస్ట్‌లు, యూటర్న్‌లకు టీడీపీ పెట్టింది పేరు అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

నన్ను మళ్లీ గెలిపించండి..
ఏపీలో అవినీతి కుంభకోణాలు బయట పెట్టింది తానేనన్న విషయాన్ని ఈ సందర్భంగా విష్ణు గుర్తు చేశారు. తన పేరు చెబితే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని.. అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో లెవనెత్తి గట్టిగా పోరాటం చేశానన్నారు. తనలాంటి నిజాయతీపరుడైన ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత మా నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. ఒక వేళ ఎన్నికల్లో ఓడిపోతే ఇంట్లో కూర్చుంటానని.. దీంతో ప్రజలకే నష్టం తప్ప తనకెలాంటి నష్టంలేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే పవన్‌‌పై విష్ణుకు ఉన్న అనుమానాలను నివృతి చేసేదెవరు..? ఈ వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తారా..? లేదా..? ఇప్పటికే బీజేపీ, టీడీపీ, వైసీపీ నేతలను దుమ్ముదులిపి వదులుతున్న పవన్.. విష్ణు వ్యాఖ్యలు స్పందిస్తారో లేకుంటే ఆయనిష్టం ఏమైనా అనుకోనీలే అని మిన్నకుండిపోతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

బాలయ్యపై ఈ లేడీ యాంకర్ గెలుస్తుందా!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గత కొద్దిరోజులుగా ‘ప్రజాశాంతి’ పార్టీ వ్యవస్థాపకుడు, క్రైసవ మతబోధకుడు నానా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే.

పెళ్లి పత్రిక చూసి షాక్ అయిన ప్రధాని మోదీ!

కాల క్రమేణా జనాలు వినూత్నంగా ఆలోచిస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాము చేసే పనిలో కొత్తదనం ఉండాలని..

ఆర్జీవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కు బ్రేక్ పడనుందా..!?

సంచలన దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.

తెలుగులో అజిత్ 'విశ్వాసం' ఎప్పుడంటే...!

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా `విశ్వాసం` తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్ ఆర్ ఆర్‌.. భారీ డీల్ 

ఆర్ ఆర్ ఆర్‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్‌'(వ‌ర్కింగ్ టైటిల్‌). 'బాహుబ‌లి' త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌