Chandra Babu:ఓడిపోయే సీట్లు ఇచ్చారంటూ.. బాబుపై హైకమాండ్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా కాషాయం పార్టీకి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే తమకు కేటాయించిన సీట్లపై ఆ పార్టీ సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. గతంలో టీడీపీ ఓడిపోయిన సీట్లను ఇప్పుడు బీజేపీకి కేటాయించారంటూ మండిపడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తీరే అంత... వేలు చూపిస్తే మండ మింగేస్తారు... గుడికి తీసుకెళ్తే గుడిని... లోపలి లింగాన్ని మింగేస్తారు... రాజకీయాల్లో ఈ విషయం పలుమార్లు స్పష్టమైంది. అయినా కానీ గొర్రె కసాయి వాడినే నమ్మినట్లు బీజేపీ నేతలు చంద్రబాబును దశాబ్దాలుగా నమ్ముతూ మోసపోతున్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నిండా మునిగిన కమలనాథులు మళ్లీ ఈ ఎన్నికలకూ పొత్తు పెట్టుకున్నారు. పాపం బీజేపీ నేతలను చంద్రబాబు నిండా ముంచేసి.. గోతిలో దించేశారు.
గత ఇరవయ్యేళ్లలో ఎన్నడూ టీడీపీ గెలవని.. కచ్చితంగా ఓడిపోయే సీట్లను బీజేపీకి అంటగట్టేశారు. మీ సీట్లు మీకు కేటాయించేశాను తాను మంచోణ్ని అంటూ కలరింర్ ఇచ్చారు. అయితే అసలు విషయం మెల్లగా అర్థం చేసుకున్న కాషాయం సీనియర్ నాయకులూ ఇంత ఘోరమా... ఇంత మోసమా.. చచ్చులు.. పుచ్చులు మాకు ఇచ్చేసి గెలిచే సీట్లు మీరు కాజేస్తారా అంటూ బాబు కుట్రను ఢిల్లీకి చేర్చారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ పురంధేశ్వరి మీద ఫిర్యాదు చేసారు.
దీంతో ఢిల్లీ పెద్దలు స్పందించి చంద్రబాబు ఇంకా మారలేదా..? అదే కుట్రలా అంటూ ఎంపీ సీట్ల ప్రకటన వాయిదా వేయించారు. మళ్లీ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. బీజేపీ అనుకూలంగా ఉండే సీట్లను డిమాండ్ చేస్తున్నారు. తమకు గెలిచే సీట్లను ఇస్తే తప్ప టీడీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించడానికి వీల్లేదు అంటూ హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీలో సీట్లు ఆశించే వారిలో టెన్షన్ మొదలైంది. తాము ఆశించే సీట్లు బీజేపీ తీసుకుంటుందో ఏమో అని తెగ మదనపడిపోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com