జగన్ కోసం తిరుమల కొండెక్కా.. కానీ మాట తప్పారు’
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సీఎం కావాలని తాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న కొండెక్కానని కానీ.. జగన్ అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టాక మాట తప్పారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. గురువారం నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి జగన్ మాట తప్పారన్నారు. డాక్టర్ సుధాకర్‌ను అవమానించటం దళితులను అవమానించిట్లేనని ఆయన అన్నారు. డాక్టర్ సుధాకర్పై ప్రభుత్వ తీరును మోత్కుపల్లి తీవ్రంగా ఖండించారు.
జగన్ కోసం కొండెక్కా..!
‘వైఎస్ జగన్ గెలుపులో నా కృషి కూడా ఉంది. జగన్ గెలవాలని కాలి నడకన తిరుమల కొండ ఎక్కాను. కృష్ణా జిల్లాకు వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలి. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాను. ఎన్టీఆర్ పార్టీ పెట్టకుంటే కేసీఆర్ ఎక్కడ ఉండేవాడు?. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తాం’ అని మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోత్కుపల్లి వ్యాఖ్యలపై టీఆర్ఎస్, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout