ముస్లింలపై నోరు జారిన బీజేపీ నేత
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల నోరు జారుడు ఎక్కువైంది. తాము ఏం మాట్లాడుతున్నామో.. ఎలా మాట్లాడుతున్నామో కూడా అర్థం కాక పిచ్చి వాగుడు వాగేస్తున్నారు. అసలే సోషల్ మీడియా కాలం అని ఎరుగక అడ్డంగా బుక్కయిపోతున్నారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలువురు నేతలు నెట్టింట్లో హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. తాజాగా కర్నాటకకు చెందిన బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మా పార్టీ రాష్ట్రంలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టబోదంటూ నోరు జారారు. ఇటీవల ఉత్తర కర్నాటకలోని కొప్పాల్లో కురుబ, మైనారిటీ వర్గాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అందుకే మేం టికెట్లు ఇవ్వం..
కాంగ్రెస్ మిమ్మల్ని కేవలం ఓటుబ్యాంకులా వాడుకుంటుంది గానీ ఒక్క టికెట్ కూడా ఇవ్వదని.. అందుకే కర్నాటకలో ముస్లింలకు మేము టికెట్లు ఇవ్వమని తేల్చిచెప్పారు. మీరు మమ్మల్ని నమ్మరు కాబట్టి అందుకే మీకు మా మీద నమ్మకం ఉంటేనే టికెట్లుగానీ.. ఇంకేమైనా మీకిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. కర్నాటకలో ఈ నెల 18, 23 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే ఈయన ముస్లింలపై గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు సందర్భాలు చాలానే ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout