దిశ నిందితుల్లాగే.. నిర్భయ నిందితులను కాల్చేయండి: బీజేపీ నేత
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. చటాన్‌పల్లి దగ్గరే పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఈ ఘటన యావత్ భారత్ దేశంలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తెల్లారు జామున సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో పాటు.. పోలీసులపై రాళ్లు రువ్వి.. వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు యత్నించగా ఆత్మరక్షణ కోసం నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.
నిర్భయ నిందితులనూ కాల్చేయండి!
అయితే.. నాటి నుంచి రేప్ నిందితులకు ఇలాంటి శిక్షే విధించాలనే డిమాండ్ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ఘటనలు జరగ్గా ఆ కామాంధులను ఎన్కౌంటర్ చేయాలని బాధిత కుటుంబాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయ్. అయితే.. తాజాగా.. సంచలనం సృష్టించిన నిర్భయ కేసులోని నిందితుల విషయంలోనూ ఇదే డిమాండ్ వస్తోంది. ఓ వైపు డెత్ వారెంట్ జారీ చేసినా.. దాన్ని ఆపేందుకు నిందితులు స్టేట్, సుప్రీం, అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పదే పదే ఉరి శిక్ష మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది.
సోషల్ మీడియా స్టార్ రియాక్షన్
ఇలా ఉరి వాయిదా పడుతూ వస్తుండటంతో విసిగిపోయిన బీజేపీ సోషల్ మీడియా స్టార్, బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ సింగ్ బాగా కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దిశ నిందితులను కాల్చి చంపినట్లుగా నిర్భయ నిందితులను కూడా కాల్చేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ ట్వీట్‌ను హైదరాబాద్ పోలీస్‌కు ట్యాగ్ కూడా చేశారు. నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అక్షయ్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ ముగ్గురూ తమకు విధించిన ఉరి శిక్షపై ‘స్టే’ విధించాలని కోరుతూ ఐసీజేలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విసిగిపోయిన తజిందర్ సింగ్ పై విధంగా రియాక్ట్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments