Adinarayana Reddy:నేను ముందే ఊహించా .. పవన్‌కు ‘‘వై’’ కేటగిరీ భద్రత కల్పించాలి : ఆదినారాయణ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
తనకు ప్రాణహానీ వుందని, సుపారీ గ్యాంగ్‌లను రంగంలోకి దించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం పవన్ కల్యాణ్‌కు భద్రతను కల్పించాలని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. ఇదిలావుండగా.. పవన్ వ్యాఖ్యలపై స్పందించారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పవన్‌కు ప్రాణహానీ వుందని తాను ఎప్పుడో ఊహించానని.. ఆయనకు తక్షణం వై కేటగిరీ భద్రతను కల్పించాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ అంటేనే విధ్వంసమన్న ఆయన.. పవన్ ఎదుగుదలను సీఎం సహించలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ బ్యాచ్ కోడిని కోసినంత ఈజీగా హత్యలు చేయగలరు :
జగన్ లాంటి వాళ్లు అధికారం, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారని ఆదినారాయణ రెడ్డి దుయ్యబట్టారు. ఇప్పటికే 3 నుంచి 4 లక్షల కోట్లు సంపాదించిన జగన్.. తాను పేదవాడినని చెప్పుకోవడం విడ్డూరంగా వుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే సీట్లు గెలవాలంటున్న జగన్.. 25 ఎంపీ సీట్లను ఎందుకు వదిలిపెట్టారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. జగన్ మనుషులు కోడిని కోసినంత సులభంగా హత్యలు చేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోకేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో వైసీపీకి భయం పట్టుకుందని.. జగన్ అవినీతికి తాము చెక్ పెట్టే సమయం వచ్చిందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. విశాఖలో ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్, బాపట్లలో పదో తరగతి బాలుడు సజీవ దహనం వంటి ఘటనలు ఏపీలో దిగజారిన పరిస్ధితులకు నిదర్శనమన్నారు.
చంద్రబాబు నుంచే పవన్‌కు ప్రాణహాని :
మరోవైపు.. తనకు ప్రాణహాని వుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రులు సెటైర్లు వేస్తున్నారు. పవన్‌కు ఏమైనా జరిగితే దానిని వైసీపీ మీదకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు నుంచే పవన్ కల్యాణ్‌కు ప్రాణహాని వుందన్నారు. ఈ విషయాన్ని గమనించి.. చంద్రబాబును ఓ కంట కనిపెడుతూ వుండాలన్నారు. వంగవీటి మోహనరంగా హత్యకు కుట్ర పన్నిన వారిలో చంద్రబాబు హస్తం వుందని కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout