Maruti Kiran:సామాన్య కార్యకర్త నుంచి పీఎం స్థాయికి ఎదిగే పార్టీ బీజేపీ మాత్రమే: మారుతి కిరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ అనేది పార్టీ కాదు కుటుంబం అని బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి తెలిపారు. 1990 నుంచి ఆర్ఎస్ఎస్‌లో ఉన్నానని.. సంఘ్‌లో ఉంటూనే బీజేపీకి పనిచేస్తున్నానని చెప్పారు. మిగతా పార్టీల లాగా బీజేపీ కాదని.. వేరే పార్టీలోకి వెళ్లినా ఉండలేమన్నారు. 2020 నుంచి మాత్రమే పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నానని.. ఈ మూడేళ్లలో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో కూడా తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.
బీజేపీ అనేది పార్టీ కాదు కుటుంబం.. ఎవరికి అన్యాయం జరగదు..
బీజేపీలో ఎవరికి అన్యాయం జరగదని.. కుటుంబ పార్టీ కాదన్నారు. కేంద్ర పెద్దల నుంచి సంఘ్, రాష్ట్ర నేతలందరూ కార్యకర్తలను గమనిస్తూ ఉంటారన్నారు. ఛాయ్ అమ్మే మోదీ పీఎం స్థాయికి ఎదిగారు.. పార్టీ ఆఫీసులో ఉండే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి.. కార్పొరేటర్ స్థాయిలో ఉండే బండి సంజయ్ ఎంపీ.. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు సామాన్య కార్యకర్తగా ఉన్న బండారు దత్తాత్రేయ రెండు సార్లు కేంద్రమంత్రితో పాటు గవర్నర్ కూడా అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీలో కార్యకర్తలను కుటుంబ సభ్యులు లాగా చూస్తారని.. పని విధానం నేర్పిస్తారని మారుతి కిరణ్ తెలిపారు.
బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయం..
వచ్చే ఎన్నికల్లో పరిగి అసెంబ్లీ టికెట్ తనకు ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ టికెట్ రాకపోయినా పార్టీ కోసమే పనిచేస్తానని స్పష్టంచేశారు. బీజేపీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. బీజేపీ ఇచ్చే మేనిఫెస్టో ఎప్పుడు కూడా సాధ్యమైన హామీలను ఇస్తామన్నారు. కేంద్ర కమిటీ ఒకటికి రెండు సార్లు పరిశీలించి అట్టడుగు వర్గాలకు కూడా లబ్ధి చేకూరాలని ఆలోచిస్తామన్నారు. ఇంకా టైం ఉందని.. బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయమన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ స్కీం విధానం తీసుకువచ్చిందే బీజేపీ అన్నారు.
పరిగిలో సరైన రోడ్లు లేవు.. వీధి దీపాలు లేవు..
పరిగి అనేది అందమైన ప్రకృతితో కూడిన ప్రాంతమన్నారు. తరతరాల నుంచే సాంప్రదాయాలు పరిగిలో చూడవచ్చన్నారు. ప్రతి ప్రాంతంలో కళాకారులు ఉన్నారన్నారు. అయితే కల్మషం లేని ప్రజలు ఉన్న ప్రాంతంలో సరైన రోడ్లు లేవని.. వీధి దీపాలు లేవన్నారు. ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే క్యారెట్, మామిడి, సీతాఫలాలు పంటలు పండించే రైతులకు న్యాయం చేస్తానని ఆయన వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout