BJP-Congress:మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణతో పాటు మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 95 స్థానాల్లో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన విధంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ జోరు కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 కాగా మ్యాజిక్ ఫిగర్ 116 రావాలి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది.
ఇక రాజస్థాన్ కౌంటింగ్‌లోనూ బీజేపీ ముందుంజలో ఉంది. 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 88 స్థానాల్లో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ రావాలంటే 101 స్థానాలు రావాలి. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. ఈసారి మాత్రం పరిస్థితి తారుమారైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ అధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో కౌంటింగ్ ముగిసే సరికి కమలం పార్టీనే అధికారం చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగి కౌంటింగ్ ప్రకారం కాంగ్రెస్ 55 స్థానాల్లో.. బీజేపీ 33 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అక్కడ అధికారం చేపట్టాలంటే 46 స్థానాలు రావాలి. ఇక్కడ కూడా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టింది.
మరోవైపు మిజోరంలోనూ ఇవాళ కౌంటింగ్ జరగనుండగా.. అక్కడ స్థానిక పరిస్థితుల కారణంగా రేపటికి కౌంటింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout