BJP-Congress:మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం..

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

తెలంగాణతో పాటు మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 95 స్థానాల్లో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన విధంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ జోరు కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 కాగా మ్యాజిక్ ఫిగర్ 116 రావాలి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది.

ఇక రాజస్థాన్‌ కౌంటింగ్‌లోనూ బీజేపీ ముందుంజలో ఉంది. 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 88 స్థానాల్లో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ రావాలంటే 101 స్థానాలు రావాలి. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిక స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. ఈసారి మాత్రం పరిస్థితి తారుమారైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ అధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో కౌంటింగ్ ముగిసే సరికి కమలం పార్టీనే అధికారం చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగి కౌంటింగ్ ప్రకారం కాంగ్రెస్ 55 స్థానాల్లో.. బీజేపీ 33 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అక్కడ అధికారం చేపట్టాలంటే 46 స్థానాలు రావాలి. ఇక్కడ కూడా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టింది.

మరోవైపు మిజోరంలోనూ ఇవాళ కౌంటింగ్ జరగనుండగా.. అక్కడ స్థానిక పరిస్థితుల కారణంగా రేపటికి కౌంటింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

More News

Bigg Boss Telugu 7 : అమర్‌‌కు ఊహించని సర్‌ప్రైజ్.. కానీ కండీషన్ , మరోసారి గౌతమ్ - శివాజీల గొడవ

బిగ్‌బాస్ తెలుగు 7 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ వారం నిర్వహించిన టికెట్ టు ఫినాలే టాస్క్‌ల్లో విజయం సాధించి అర్జున్ అంబటి ఈ సీజన్‌లో

Revanth Reddy:పోస్టల్‌ బ్యాలెట్లలో కాంగ్రెస్‌దే హవా.. రేవంత్ రెడ్డి ముందంజ..

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది.

Congress:రెండు రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు

కామారెడ్డిలో 4389 ఓట్ల ఆధిక్యంతో రేవంత్‌రెడ్డి.. మూడో రౌండ్‌ ముగిసే సరికి 4389 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

KCR- Rahul Gandhi:కేసీఆర్ ఎత్తులకు కాంగ్రెస్ పైఎత్తులు.. రంగంలోకి రాహుల్ గాంధీ..

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఫలితాలపై ఇటు ప్రజలతో పాటు అన్ని పార్టీల నేతలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Congress:ఈనెల 4న కేబినెట్ భేటీపై సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు.