TDP manifesto- Modi:టీడీపీ మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదా..? ప్రధాని మోదీ ఫొటో ఎందుకు లేదు..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో దీనిని ప్రకటించారు. అయితే మేనిఫెస్టో కాపీపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫోటోలు మాత్రమే ఉండటం.. ప్రధాని మోదీ, బీజేపీ గుర్తు లేకపోవటం ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు ఈ కార్య్రమంలో పాల్గొన్న బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్ అంటీముట్టనట్లుగా వ్యవహరించడం హాట్‌టాపిక్‌గా మారింది. మేనిఫెస్టో కాపీని అందిస్తున్న సమయంలోనూ ఆయన చేతికి తీసుకోవడానికి ఇష్టపడకపోవటం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
దీంతో సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. టీడీపీ తయారుచేసిన మేనిఫెస్టోకు బీజేపీ వ్యతిరేకంగా ఉందని.. చంద్రబాబు ప్రకటించిన ఉచిత పథకాలకు తమ మద్దతు లేదని పరోక్షంగా చెప్పినట్లు చెబుతున్నారు. ముందు నుంచి కూడా ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకంగా ఉంటుంది. ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఉచిత హామీలకు దూరంగా ఉంటూ వస్తోంది. చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ కూడా ఉచితాలకు వ్యతికేకంగా మాట్లాడారు.
ఈ క్రమంలోనే టీడీపీ ఇచ్చిన హామీల్లో ఎక్కువగా ఉచిత పథకాలు ఉండటంతోనే ఆ పార్టీ దూరంగా ఉందంటూ ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మేనిఫెస్టో మీద ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, పురంధేశ్వరి ఫోటోలు లేకుండానే ముద్రించారని పేర్కొంటున్నారు. ఇది కేవలం టీడీపీ-జనసేన మేనిఫెస్టో మాత్రమే అని.. ఈ మేనిఫెస్టోకు బీజేపీకి సంబంధం లేదని కొంతమంది కమలం నేతలు స్పష్టంచేస్తున్నారు. దీంతో ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ-జనసేన ప్రకటించిన మేనిఫెస్టోకి కేంద్రంలోని బీజేపీ ఆశీస్సులు లేకపోతే ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై బీజేపీ పెద్దల వైఖరి ఏంటనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout