BJP:14 మందితో బీజేపీ నాలుగో(తుది) జాబితా విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న సీట్లను పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే 14 మందితో బీజేపీ తుది జాబితా విడుదల చేసింది.
అభ్యర్థుల వివరాలు ఇవే..
సంగారెడ్డి - డి. రాజేశ్వరరావు
బెల్లంపల్లి- కోయల ఎమోజీ
శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్
మల్కాజ్‌గిరి- ఎన్ రామచంద్రరావు
మేడ్చల్- సుదర్శన్ రెడ్డి
పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్
నాంపల్లి - రాహుల్ చంద్ర
చాంద్రయాణగుట్ట - కే మహేందర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్- గణేష్ నారాయణ్
దేవరకద్ర- కొండా ప్రశాంత్ రెడ్డి
వనపర్తి- అనుజ్ఞారెడ్డి
అలంపూర్ - మేరమ్మ
ఈ జాబితాలో మొత్తం 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111 మంది అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా మిగిలిన 8 స్థానాలను జనసేన పార్టీకి కేటాయించింది. బీజేపీ మొత్తం అభ్యర్థులను పరిశీలిస్తే ముగ్గురు ఎంపీలు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఏకంగా సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ నియోజకవర్గంలో పోటీకి సై అన్నారు. అలాగే తన సిట్టింగ్ స్థానం హుజురాబాద్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ మాత్రం ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments