శివసేనకు బీజేపీ కొత్త బంపరాఫర్.. రాజీ కుదిరేనా!?

  • IndiaGlitz, [Wednesday,October 30 2019]

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై దాదాపు కొలిక్కి వచ్చేసినట్లేనని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు మొదలుకుని ఇప్పటి వరకూ ప్రభుత్వ ఏర్పాటుపై తేలని లెక్క బుధవారంతో తేలిపోయింది. సీఎం పదవి ఇచ్చితీరాల్సిందేనని శివసేన పట్టుపట్టిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం ‘ఆ ఒక్కటి అడక్కు..’ అన్నట్లుగా సీఎం సీటును మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేసింది. అయితే తాజాగా శివసేనకు బీజేపీ బంపరాఫర్ ఇచ్చింది.

డిప్యూటీ సీఎం పదవితో పాటు 13 మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ బంపరాఫర్ ఇచ్చింది. అయితే సీఎం పదవి మాత్రం అడగాల్సిన అక్కర్లేదని బీజేపీ తేల్చిచెప్పేసింది. అయితే 26 మంత్రి పదవులు మాత్రం బీజేపీనే తీసుకుంటుందని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలతో ఫడ్నవిస్ భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రేపు అనగా గురువారం నాడు ఉద్ధవ్ థాక్రే నివాసంలో శివసేన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. కూటమి విజయం ఘనత ఉద్దవ్ థాక్రేదేనని ఫడ్నవిస్ ఆయన్ను ఆకాశానికెత్తేశారు. త్వరలోనే అభిప్రాయభేదాలు తొలగిపోతాయని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది ఇండిపెండెంట్లు కూటమికి మద్ధతిచ్చారని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. అయితే ఇంతవరకూ ఓకే గానీ ఈ ప్రకటనతో శివసేన రాజీ అయినట్లేనా.. ? లేకుంటే 50:50 నే అని మొండికేసి మళ్లీ తిష్టవేసి కూర్చుంటుందా..? అనేది తెలియాల్సి ఉంది.

More News

'భాస్కర్ ఒక రాస్కల్ ' గా వస్తున్న అరవింద స్వామి

అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో సిద్ధికీ తమిళంలో రూపొందిన భాస్కర్ ఓరు రాస్కల్  ఇప్పడు తెలుగులో భాస్కర్

బాలయ్య వియ్యంకుడికి షాకిచ్చిన వైఎస్ జగన్!

ఇదేంటి బాలయ్య పేరు ఎందుకొచ్చింది..? అసలు ఈ షాకులేంటి..? ఆయనెవరికో షాకిస్తే బాలయ్యకు ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారు కదూ..?

రామ్ `రెడ్` రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం `రెడ్‌` నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

రాజకీయాల‌కే తొలి ప్రాధాన్య‌త‌ : విజ‌య‌శాంతి

``రాజకీయాల‌నేవి పూర్తి అంకిత భావంతో చేయాలి. కాబ‌ట్టి ప్ర‌స్తుతం నా ప్రాధాన్య‌త ముందు రాజ‌కీయాల‌కే`` అని అంటున్నారు

4గంటల పాటు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

ఒకట్రెండు కాదు సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.