తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్

  • IndiaGlitz, [Wednesday,March 11 2020]

తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను అధిష్టానం నియమించింది. బుధవారం సాయంత్రం అధికారికంగా కేంద్ర అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్‌ను నియమించడం జరిగింది. కాగా.. తక్షణం ఆయన రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం బండి.. కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఏబీవీపీ, యువమోర్చాతో పాటు ఆర్ఎస్ఎస్‌తో మంచి సంబంధాలున్న బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి వరించింది. ఈ సందర్భంగా సంజయ్‌కు పలువురు ప్రముఖులు, రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

వాస్తవానికి గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం కోసం పలువురు ఆశావహులు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. పార్టీ అధిష్ఠానం నుంచి పరిశీలకులు అనీల్ జైన్ తదితరులు తెలంగాణకు వచ్చి ఇక్కడి నేతల అభిప్రాయాలను కూడా తీసుకుని.. బండి సంజయ్‌ పేరును ఖరారు చేయడం జరిగింది. అయితే బండి ఆధ్వర్యంలో పార్టీ ఏ మాత్రం బలోపేతం అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

'నన్నేలు నా స్వామి' మహాగ్రంధాన్ని ఆవిష్కరించిన అమిత్ షా

ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ' ఆరాధన' పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మరొక సారి పవిత్ర సంచలనానికి తెర లేపారు.

సింధియా ఎఫెక్ట్.. డీకేకు కర్ణాటక పగ్గాలు!

కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్ షూటర్, పార్టీకి విధేయుడిగా.. కట్టప్పలా కాంగ్రెస్‌కు కాపలా ఉంటున్న డీకే శివకుమార్‌కు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.

జగన్ షాకింగ్ నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ నేతలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాటినుంచి ఇప్పటి వరకూ పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్న

బోండా ఉమ, బుద్ధాపై దాడి.. కార్లు ధ్వంసం.. అసలేమైంది!?

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ వర్గీయులు దాడికి దిగారు.

మ‌రోసారి సాయితేజ్ సినిమాలో..

గ‌త ఏడాది విడుద‌లైన ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంతో త‌న కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు సాయితేజ్.