Revanth Reddy: బీఆర్‌ఎస్‌కు మద్దతుగా బీజేపీ, ఈసీ వ్యవహరిస్తున్నాయి: రేవంత్
Send us your feedback to audioarticles@vaarta.com
రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల అధికారులు అధికార పార్టీకి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అనుబంధం మరోసారి తేటతెల్లమైందన్నారు. నవంబర్ 15వ తేదీ లోపు రైతుబంధు సాయం పంపిణి జరిగేలా తాము గతంలోనే ఈసీని కోరామని కానీ దానిని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రయోజనం చేకూర్చేలా రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు వల్ల రైతులకు రూ.5వేల కోట్ల నష్టం జరుగుతోందని తెలిపారు. డిసెంబర్‌లో అయితే 15వేల రైతు భరోసా వచ్చేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ నాయకుల ఇళ్లు, కార్యాయాలలోనే ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయని.. దీనిని బట్టి చూస్తుంటే బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమవుతోందని రేవంత్ వెల్లడించారు.
కాగా రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, రైతు రుణమాఫీల కోసం నిధులు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ఈసీ అధికారులను విజ్ఞప్తిచేసింది. ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల అధికారులు సీఈసీ దృష్టికి తీసుకువెళ్లగా రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు విడుదలకు మాత్రం అనుమతి ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments