Revanth Reddy: బీఆర్‌ఎస్‌కు మద్దతుగా బీజేపీ, ఈసీ వ్యవహరిస్తున్నాయి: రేవంత్

  • IndiaGlitz, [Saturday,November 25 2023]

రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల అధికారులు అధికార పార్టీకి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అనుబంధం మరోసారి తేటతెల్లమైందన్నారు. నవంబర్ 15వ తేదీ లోపు రైతుబంధు సాయం పంపిణి జరిగేలా తాము గతంలోనే ఈసీని కోరామని కానీ దానిని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు.

తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రయోజనం చేకూర్చేలా రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు వల్ల రైతులకు రూ.5వేల కోట్ల నష్టం జరుగుతోందని తెలిపారు. డిసెంబర్‌లో అయితే 15వేల రైతు భరోసా వచ్చేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్ నాయకుల ఇళ్లు, కార్యాయాలలోనే ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయని.. దీనిని బట్టి చూస్తుంటే బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమవుతోందని రేవంత్ వెల్లడించారు.

కాగా రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, రైతు రుణమాఫీల కోసం నిధులు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ఈసీ అధికారులను విజ్ఞప్తిచేసింది. ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల అధికారులు సీఈసీ దృష్టికి తీసుకువెళ్లగా రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు విడుదలకు మాత్రం అనుమతి ఇచ్చింది.

More News

BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా హస్తం కండువా కప్పుకుంటున్నారు.

IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో రూ.40లక్షలు నగదు పట్టివేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఐటీ అధికారుల దాడులు కూడా వేగం పుంజుకున్నాయి. ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.

KCR: సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక నోటీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. బాధ్యతాయుతమైన పదవి, పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతూ

Bigg Boss Telugu 7: ‘ ఒక్క ఛాన్స్ అన్నా.. శివాజీని వేడుకున్న అమర్‌దీప్, షాకిచ్చిన బిగ్‌బాస్.. తెగేదాకా లాగితే ఇంతే

బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వుండగా.. ఈ సీజన్‌కు లాస్ట్ కెప్టెన్ ఎవరో ఈ వారం తేలిపోనుంది.

Modi: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందేలా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు కమిటీని ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.