న్యూ ఇయర్ వేడుకల్లో శ్రద్ధాకు చేదు అనుభవం!
Send us your feedback to audioarticles@vaarta.com
న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు వేడుకలకు కొదవుండదు. డబ్బులు పోయినా సరే.. యూత్‌కు ఇవాళ వచ్చే కిక్కే వేరు.. డీజేలు, సెలబ్రిటీలను రప్పించి డ్యాన్స్‌లు చేయించి.. ఆర్కెస్టా అదరగొడుతుంటారు. అయితే ఇలాంటి పండుగ సమయంలో ఫంక్షన్లకు, ఓపెనింగ్స్‌కు వెళ్లే సెలబ్రిటీలకు డబుల్ ధమాకానే.. ఎందుకంటే వాళ్లు ఆడిపాడినా.. ఓపెనింగ్స్ చేసినా గట్టిగానే పారితోషికం పుచ్చుకుంటారు. ఇదిలా ఉంటే.. న్యూ ఇయర్ ఈవెంట్లో పాల్గొనడానికి శ్రద్ధా దాస్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు వెళ్లింది. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తారనేసరికి ఖమ్మంకు ఈ అమ్మడు వెళ్లిపోయింది. తీరా చూస్తే చేదు అనుభవంతో వెనుతిరగాల్సి వచ్చింది.
సెలబ్రిటీ వస్తున్నారంటే జనాలు ఏ రేంజ్లో ఎగబడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే శ్రద్దా వస్తోందని తెలుసుకున్న జనాలు గట్టిగనే గుమికూడారు. శ్రద్ధా స్టేజ్ పైకి వచ్చిందే ఆలస్యం ఈలలు కేకలతో కుర్రకారు హోరెత్తించారు. అయితే.. శ్రద్ధాకు బౌన్సర్, సెక్యూరిటీ పెద్దగా లేకపోవడంతో బాగా ఇబ్బంది పడింది. ఫొటోలు తీసుకోవడానికి వచ్చిన కుర్రాళ్లతో తెగ ఇబ్బంది పడింది. కొందరైతే ఎక్కడెక్కడో టచ్ చేశారట. దీంతో ఇబ్బంది పడ్డ.. శ్రద్ధా వారితో ఫొటోలు దిగకుండా.. అసంతృప్తిని అంతంత మాత్రంగానే డ్యాన్స్ చేసి స్టేజ్‌పై నుంచి వెళ్లిపోయిందట. మొత్తానికి చూస్తే.. రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తారు కదా అని వచ్చిన ఖమ్మం దాకా వెళ్లిన శ్రద్ధా తీవ్ర అసంతృప్తి వెనుతిరగడం.. న్యూ ఇయర్ వేళ ఇదో చేదు అనుభవంగా మిగిలిపోతుందేమో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com