కరోనా మనకొస్తాది అనుకున్నా.. కానీ క్లైమాక్స్ చూశా: బిత్తిరి సత్తి
- IndiaGlitz, [Sunday,August 16 2020]
బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. కరోనా ఒక్కటి మాత్రం నేర్పిస్తోందని.. మన బాసాన్లు మనమే తోముకునేలా.. మన బట్టలు మనమే ఉతుక్కునేలా.. చెప్తే కామెడీగా ఉంటుందని బిత్తిరి సత్తి తెలిపాడు. ‘మనకొస్తాది.. స్టాండర్డ్ బాడీ.. వచ్చిన తెల్వదు అనుకున్నా.. కరోనా వచ్చిందని ఏర్పాటు చేయలేదు. మనం రెస్ట్ లేకుండా పని చేస్తే అది పైకి వస్తది. మంచి స్టాండర్డ్ ఫుడ్ తీసుకోవాలి. చిరు ధాన్యాలు తీసుకోవాలి. దవాఖానకు పోవాలన్న ఆలోచన కూడా రాలేదు. డాక్టర్ సలహా అయితే తీసుకుంటున్నా. వచ్చిందని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నారు. మనం మంచిగా ఉండాలి.. అవతలి వాళ్లు మంచిగా ఉండాలి. కరోనా వచ్చిందంటే కొందరు వివక్ష చూపిస్తారు.. అలాంటి చెయ్యొద్దు’ అని రవి సూచించాడు.
అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పాడు. తనకు స్వెట్టింగ్ బాగా ఉందని.. గొంతు నొప్పి.. జలుబు.. నాలుక మందమవడం వంటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని రవి తెలిపాడు. గొంతునొప్పి అజిత్రోమైసిన్ వేసుకుంటే తగ్గిపోయిందన్నాడు. రెండు రోజుల పాటు తాను క్లైమాక్స్ చూశానని.. రెండు రోజుల పాటు నిద్రనేదే లేదని తెలిపాడు. ఆవిరి పట్టడం ద్వారా చాలా రిలీఫ్ వచ్చిందన్నాడు. పల్స్ రేటు ప్రస్తుతం నార్మల్‌గా ఉందన్నాడు. మనకు కరోనా సోకితే వెల్లడించాలని.. చెప్పకుండా అందరితో కలిసి తిరిగితే మనంత ద్రోహి మరొకడు ఉండడన్నాడు. మామూలు లక్షణాలు ఉంటే ఇంట్లో ఉండాలని సూచించాడు. లక్షణాలు తీవ్రంగా ఉంటే మీ స్థోమతని బట్టి ఏదో ఒక ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని రవి సూచించాడు.
కరోనా వస్తే నిర్భయంగా చెప్పి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించాడు. సి విటమిన్ ఎక్కువగా తీసుకోవాలని వెల్లడించాడు. తనకు బయట తిరగాలని ఉందని.. కానీ అవతలి వాళ్లకు ప్రాబ్లమ్ అవుతుందని ఆగానన్నాడు. నాలుగు రోజులుగా తాను ఇంటికే పరిమితమయ్యానన్నాడు. కరోనా పాజిటివ్ వచ్చినా రాకున్నా.. ఆవిరి పట్టాలని సూచించాడు. నిమ్మరసం తాగాలని పేర్కొన్నాడు. దయచేసి అంతా సామాజిక దూరం పాటించాలని కోరాడు. ఎలా వచ్చిందో ఏమో చెప్పలేను కానీ మనవల్ల అవతలి వాళ్లకు రావొద్దని కోరుకుంటున్నా. ధైర్యంగా ఉండాలని.. ఆరోగ్య సూత్రాలు కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.