‘సాక్షి’ గూటికి చేరిన బిత్తిరి సత్తి.. ప్రోగ్రాం ఎప్పుడంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
సాక్షి టీవీలో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికి ‘సాక్షి’ టీవీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ చేసిన టీం మెంబర్ కుమార్‌కి కూడా సాక్షిలో బెర్త్ కన్ఫర్మ్ అయింది. మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించి.. వీ 6 ఇచ్చిన లిఫ్ట్‌తో బిత్తిరి సత్తిగా ఓ మంచి సెలబ్రిటీ స్టేటస్‌ను సంపాదించుకున్నారు చేవెళ్ల రవి. తెలుగు రాష్ట్రాల్లో బిత్తిరి సత్తికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే వీ 6 నుంచి బయటకు వచ్చేసిన తరువాత మాత్రం ఆయన అనుకున్నంతగా రాణించలేకపోయారనే దానిలో సందేహం లేదు.
వీ6లో తీన్‌మార్ పేరుతో వచ్చిన ప్రోగ్రాంలో బిత్తిరి సత్తిగా తనదైన ముద్ర వేసుకున్న రవి.. టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్ పేరుతో ప్రోగ్రాంను చేశారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. టీవీ 9లో తాను చేస్తున్న ఇస్మార్ట్ న్యూస్ అనే ప్రోగ్రాంను హిట్ చేసేందుకు చాలా కష్టపడ్డానని ఇటీవల బిత్తిరి సత్తి తెలిపాడు. అయితే తాను చేసిన ఓ ప్రోగ్రాం యాజమాన్యానికి నచ్చక పోవడంతో తనను బయటకు పంపివేశారని తెలిపాడు. ఇక బిత్తిరి సత్తి వచ్చే సోమవారం నుంచి రాత్రి 8:30కు సాక్షి టీవీ ద్వారా కనువిందు చేయబోతున్నాడు. ‘సాక్షి’కి మారాడు కాబట్టి ఇకపై బిత్తిరి సత్తి కెరీర్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com