వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ సిద్ధం
Send us your feedback to audioarticles@vaarta.com
డిపరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే వరుణ్ తేజ్ ..‘ఎఫ్ 2’, ‘గద్దల కొండ గణేష్’ చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ యంగ్ హీరో రెండు కమర్షియల్ చిత్రాల తర్వాత ఇప్పుడు మరో సినిమాలను ట్రాక్ ఎక్కించేశాడు. అందులో ఒకటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను జనవరి 19 ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఓలింపిక్ బాక్సింగ్ విన్నర్ టోని జెఫ్రీస్ దగ్గర ప్రత్యేకమైన శిక్షణను తీసుకున్నాడు వరుణ్ తేజ్.
సినిమాలో స్టార్ కేస్ట్ కూడా బలంగానే ఉంది. ఎందుకంటే ఉపేంద్ర, జగపతిబాబు, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటిస్తోంది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com