డీ గ్లామర్డ్ రోల్ లో తెలుగమ్మాయి

  • IndiaGlitz, [Saturday,October 17 2015]

పేరుకి తెలుగ‌మ్మాయిలు అయినా.. తెలుగులో కంటే త‌మిళంలోనే మంచి అవ‌కాశాల‌ను పొందుతూ దూసుకుపోతున్న వారి జాబితా ఈ మ‌ధ్య బాగానే ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ లిస్ట్‌లోని ఓ నాయిక బిందుమాధ‌వి. 'ఆవ‌కాయ్ బిర్యానీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బిందు.. 'బంప‌ర్ ఆఫ‌ర్‌'తో హిట్ కొట్టింది.

ఆ త‌రువాత కొన్ని సినిమాల్లో నాయిక‌గా న‌టించినా.. ఆశించిన గుర్తింపు రాలేదు. ఈ లోపు త‌మిళంలో అవ‌కాశాలు రావ‌డంతో అటు వైపు మొగ్గిన బిందుకి 'కేడి బిల్లా కిలాడి రంగా', 'వ‌రుత్త ప‌డాద వాలిబ‌ర్ సంఘం' లాంటి హిట్స్ ల‌భించ‌డంతో ఆమె స్టార్ తిరిగింది. త‌మిళ స్టార్ సూర్య కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న 'ప‌సంగ 2'లోనూ.. విక్ర‌మ్ న‌టిస్తున్న 'మ‌ర్మ మ‌నిద‌న్‌'లోనూ బిందు ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వీటిలో 'ప‌సంగ 2' కోసం బిందు డీ గ్లామ‌ర్డ్ రోల్‌లో సంద‌డి చేయ‌నుంద‌ట‌. న‌వంబ‌ర్ 27న ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

'బ్రహ్మోత్సవం' హిట్ సెంటిమెంట్

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత మహేష్బాబుతో శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న చిత్రం'బ్రహ్మోత్సవం'.

దసరా కానుకగా ప్రారంభం కానున్న'ఎవడో ఒకడు'

మాస్ మహారాజా రవి తేజ హీరో గా, మళయాళ చిత్రం ‘ప్రేమం’ తో యువకుల మనసులు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్వరలో 'ఎవడో ఒకడు' అనే చిత్రం రాబోతోంది.

ఆ..స్టెప్పు చరణ్ కి నచ్చలేదు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం బ్రూస్ లీ.ఈ చిత్రంలో చరణ్ వేసిన ఫ్లూట్ స్టెప్ చూస్తుంటే..ఇంద్ర సినిమాలో చిరంజీవి వీణ స్టెప్పు గుర్తుకువస్తుంది.

ప‌వ‌న్ మూవీకి దాస‌రి డైరెక్ట‌ర్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ద‌ర్శ‌క‌ర‌త్న‌దాస‌రి ఓ చిత్రాన్ని నిర్మిస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

సందీప్ కిష‌న్ విల‌న్ ఎవ‌రు

సందీప్ కిష‌న్ హీరోగా రైట‌ర్ రాజ‌సింహ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క అమ్మాయి త‌ప్ప.. అనే చిత్రం రూపొందుతుంది.