డీ గ్లామర్డ్ రోల్ లో తెలుగమ్మాయి
Send us your feedback to audioarticles@vaarta.com
పేరుకి తెలుగమ్మాయిలు అయినా.. తెలుగులో కంటే తమిళంలోనే మంచి అవకాశాలను పొందుతూ దూసుకుపోతున్న వారి జాబితా ఈ మధ్య బాగానే ఉన్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లోని ఓ నాయిక బిందుమాధవి. 'ఆవకాయ్ బిర్యానీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బిందు.. 'బంపర్ ఆఫర్'తో హిట్ కొట్టింది.
ఆ తరువాత కొన్ని సినిమాల్లో నాయికగా నటించినా.. ఆశించిన గుర్తింపు రాలేదు. ఈ లోపు తమిళంలో అవకాశాలు రావడంతో అటు వైపు మొగ్గిన బిందుకి 'కేడి బిల్లా కిలాడి రంగా', 'వరుత్త పడాద వాలిబర్ సంఘం' లాంటి హిట్స్ లభించడంతో ఆమె స్టార్ తిరిగింది. తమిళ స్టార్ సూర్య కీలక పాత్రలో నటిస్తున్న 'పసంగ 2'లోనూ.. విక్రమ్ నటిస్తున్న 'మర్మ మనిదన్'లోనూ బిందు ఓ హీరోయిన్గా నటిస్తోంది. వీటిలో 'పసంగ 2' కోసం బిందు డీ గ్లామర్డ్ రోల్లో సందడి చేయనుందట. నవంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com