బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న బిందు మాధవి

  • IndiaGlitz, [Sunday,November 22 2015]

ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందిన‌ట్టే అంది చేజారితే ఎవ‌రికైనా ఎలాగుంటుంది? క‌చ్చితంగా బాధ‌గానే ఉంటుంది క‌దూ. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే తెలుగ‌మ్మాయి బిందు మాధ‌విది. నిన్న‌టి వ‌ర‌కు విక్ర‌మ్ కొత్త సినిమా 'మ‌ర్మ‌ మ‌ణిద‌న్‌'లో రెండో హీరోయిన్‌గా త‌మిళ‌నాట వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చిన బిందు.. ఇప్పుడు అనూహ్యంగా ఆ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.

ఇప్పుడు ఆమె స్థానంలో ఓ ప్ర‌ముఖ హీరోయిన్‌ని ఎంచుకునే దిశ‌గా చిత్ర యూనిట్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. విక్ర‌మ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టిస్తుండ‌గా.. మ‌రో హీరోయిన్ ఎంపిక జ‌ర‌గాల్సి ఉంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాకి ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు కాగా.. అనిరుధ్ సంగీత‌మందించ‌నున్నాడు. ఏదీఏమైనా.. బిందు ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ని మిస్స‌య్యింది. బెట‌ర్ ల‌క్ నెక్ట్స్ టైమ్ బిందు!

More News

నయనతార నయా రికార్డ్

పదేళ్లకు పైగా హీరోయిన్ గా నటిస్తున్నా..నయనతార క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.వరుస విజయాలతో ఈ ఏడాదిలో ఫుల్ఫామ్ లోకి వచ్చిన నయన..

'సైజీజీరో' బంగారం కాంటెస్ట్‌

అనుష్క‌, ఆర్య ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో పివిపి బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం ‘సైజ్‌జీరో’. వెయిట్‌లాస్ అనే పాయింట్‌పై తెర‌కెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 27న విడుద‌ల‌వుతుంది.

త‌నతో ఫోటో దిగాల‌ని ఆశ‌ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో ఎవ‌రైనా ఫోటో దిగాల‌ని ఆశ‌ప‌డుతుంటారు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఒక వ్య‌క్తితో ఫోటో దిగాల‌ని ఆశ‌ప‌డ్డాడ‌ట‌.

ఊటీలో బ్ర‌హ్మోత్స‌వం

మ‌హేష్ హీరోగా పి.వి.పి. సినిమా ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు.

న‌వ యువ సంచ‌ల‌నం నాగ చైత‌న్య‌..హ్యాపీ బ‌ర్త్ డే

అక్కినేని వంశం మూడోత‌రం క‌థానాయ‌కుడుగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన న‌వ యువ సంచ‌ల‌నం నాగ చైత‌న్య‌. నాగార్జున వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన నాగ చైత‌న్య అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్నాడు.