బిల్‌గేట్స్ దంపతుల షాకింగ్ నిర్ణయం.. విడిపోతున్నామంటూ ప్రకటన

ఇటీవలే ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సైతం తన భార్య మాకెంజీ స్కాట్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరో ప్రపంచ కుబేరుడు సైతం నడించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ కుబేరులలో ఒకరు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్(65), ఆయన సతీమణి మిలిందా గేట్స్(56) సంచలన ప్రకటన చేశారు. 27 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నట్టు ఈ జంట ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా సోమవారం అర్థరాత్రి దాటాక ప్రకటించి షాక్ ఇచ్చారు. గత 27 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందిన ఈ జంట.. ఇకపై దంపతులుగా కలిసి ఉండలేమని భావిస్తున్నట్లు తెలిపారు.

Also Read: హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో 8 సింహాలకు కరోనా లక్షణాలు!

జీవితంలో ఇక భార్యాభర్తలుగా కలిసి ఉండలేమని ఇరువురు సంయుక్త ప్రకటన చేశారు. అయితే, తమ బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఎన్నో సమాలోచనలు, ఎంతో ఆవేదన తర్వాత 27 ఏళ్ల మా వైవాహిక బంధానికి ముగింపు పలకాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం. ప్రపంచంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మెరుగైన జీవనం కల్పించే ఫౌండేషన్ను స్థాపించాం. ఈ ఫౌండేషన్ కోసం మేము కలిసే పనిచేస్తాం. కానీ, జీవితంలోని తర్వాతి దశల్లో మేము దంపతులుగా కొనసాగలేమని భావిస్తున్నాం. అని తమ సంయుక్త ప్రకటనలో బిల్‌గేట్స్ దంపతులు వెల్లడించారు.

ఇక ప్రస్తుతం బిల్‌గేట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి విలువ సుమారు 137 బిలియన్ డాలర్లు. ఇక 2000లో స్థాపించిన బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ 53 బిలియన్‌ డాలర్లను వివిధ స్వచ్ఛంద కార్యాక్రమాలకు వినియోగించారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ వయసు 65 కాగా.. మెలిందా వయసు 56 ఏళ్లు. 1994లో వివాహబంధంతో ఒక్కటైన బిల్ గేట్స్ దంపతులు 27 ఏళ్ల తర్వాత విడిపోతుండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్ సీఈవోగా ఉన్న సమయంలో మిలిందా ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరారు. అప్పట్లో కంపెనీలో చేరిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ మెలిందాయే కావడం విశేషం.

More News

హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో 8 సింహాలకు కరోనా లక్షణాలు!

దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో కరోనా విలయం సృష్టిస్తోంది.

స్పీకర్ తమ్మినేని దంపతులకు సీరియస్!

కరోనా సెకండ్ వేవ్ ఊహకందని రీతిలో వ్యాపిస్తోంది. రోజుకు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా..

ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసేందుకు సిద్ధమైన ‘కేజీఎఫ్’ బ్యూటీ

‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న చిత్రం ‘సలార్’.

తమిళ స్టార్ హీరోతో వంశీ పైడిపల్లి నెక్ట్స్ సినిమా..

‘ఊపిరి’, ‘మహర్షి’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వంశీ పైడిపల్లి.

ఈ మొక్కలు ఇంట్లో ఉన్నాయంటే.. ఆక్సిజన్‌కు కొదవుండదు..

ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఎంత అవసరమనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున జనం కరోనా బారిన పడుతున్నారు.