నవ్వించేందుకు బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సిద్ధం...

  • IndiaGlitz, [Thursday,February 28 2019]

జీవితంలో ఎన్నో ఒత్తిడులు. రోజంతా కష్టానికి మనపై పడిన ప్రభావమది. ఒక చిన్న చిరునవ్వు ఆ మొత్తం ఒత్తిడిని చిత్తు చేస్తుంది. మనసుకు హాయినిస్తుంది. మనం పడిన శ్రమనంతా గతాన్ని చేసేస్తుంది. మరి అలాంటి నవ్వు రెండున్నర గంటలు దక్కితే ఎంత ఉల్లాసంగా ఉంటుంది. అలాంటి నవ్వును పంచేందుకు సిద్ధమవుతున్న చిత్రమే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్.

ఈ చిత్రాన్ని ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మించారు. .యువ దర్శకుడు నాగసాయి మాకం తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించారు. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా మార్చి 15న ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ... సినిమా ధ్యేయం వినోదాన్ని పంచడం అయితే నవ్విస్తూ ఒక చిన్న ఆలోచన ప్రేక్షకుల్లో కలిగిస్తే ఆ చిత్రానికి సార్థకత చేకూరినట్లే. అలాంటి సార్థక చిత్రమే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో సందేశాన్ని కలిపి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఎంత నాణ్యమైన చిత్రాన్ని నిర్మించామో, అంతే ఘనంగా మార్చి 15న విడుదల చేస్తున్నాం. అన్నారు.

దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ.... నా తొలి చిత్రం ప్రేక్షకుల తీర్పునకు వస్తుండటం సంతోషంగా ఉంది. మేము రూపొందించిన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాము. ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది మా సినిమా. బిలాల్ పూర్ కథలో నవ్వులు, బాధలు, సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలు, పోలీసు ఉద్యోగంలోని సాదకబాధకాలు అన్నీ ఉంటాయి. సంగీత సాహిత్యాలు ఆకట్టుకుంటాయి. సాబూ వర్గీస్ సంగీతం, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా పాటలు కథా విలువను పెంచుతాయి. సమాజంలో జరుగుతున్నకొన్ని చేదు ఘటనలు కూడా ఉంటాయి. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. అన్నారు.

ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - తోట వి రమణ, ఎడిటింగ్ - ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం - సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ - జీబూ, డీటీఎస్ - రాజశేఖర్, పాటలు - గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనిశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత - మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం - నాగసాయి మాకం.

More News

న‌వీన్ చంద్ర '28°c' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

న‌వీన్ చంద్ర‌, షాలిని, వ‌డ్నిక‌ట్టి హీరో హీరోయిన్‌గా వీరాంజ‌నేయ ప్రొడ‌క్ష‌న్స్‌, రివ‌ర్ సైడ్ సినిమాస్ ప‌తాకాల‌పై డా.అనీల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ సాయి నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం '28°c'.

రేపు ఇండియాకు పైలట్ అభినందన్..

భారత పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను పాక్ చెరనుంచి క్షేమంగా తిరిగి రావాలని యావత్ ఇండియా చేసిన ప్రార్థనలు, అధికారుల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.

నేను పవన్‌‌ను ఏమన్లేదు..కౌశల్ వివరణ

గత కొద్దిరోజులుగా అటు టీవీ చానెల్స్‌‌.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్‌పై బిగ్‌బాస్-2 విజేత కౌశల్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చాడు.

ఊహించని ధరలతో రెడ్‌మీ నోట్ 7, నోట్‌ 7 ప్రొ వచ్చేశాయ్..

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి ఇతర కంపెనీలతో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో ‘స్మార్ట్’గా ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

పాక్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: మోదీ

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ.. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు.