నవ్వించడానికి సిద్ధమవుతున్న బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
పోలీస్‌నేపథ్యంలో జరిగే కథ ఇలాగే వుండాలి అని అందరూ అనుకుంటున్న ఫార్ములాను మా చిత్రం బ్రేక్ చేస్తుంది. అంటున్నారు నిర్మాత మహంకాళి శ్రీనివాసులు. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై నాగసాయి మాకంను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మిస్తున్న చిత్రం బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్. శ్రీనాథ్ మాగంటి, మేఘన హీరో, హీరోయిన్లు.షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇదొక వినూత్నమైన ప్రయత్నం.ఎంటర్టైనింగ్గా వుంటూనే అందరికి థ్రిల్ల్‌ను కలిగించే చిత్రమిది.కథ మీద నమ్మకంతో, దర్శకుడి ఆలోచనలకి అనుగుణంగా ఉన్నత నిర్మాణ విలువలతో చిత్రాన్ని నిర్మించాం.తప్పకుండా చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ యదార్థ సంఘటనల స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. పూర్తి సహజమైన కథ, కథనాలతో మనసుకు హత్తుకునే విధంగా వుంటుంది. కామెడీ కూడా సన్నివేశానికి అనుగుణంగా పూర్తి సహజంగా వుంటుంది. ప్రజా కవి గోరటి వెంకన్న ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి అని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, ఎడిటర్: ఉద్దవ్ ఎస్బి, సంగీతం: సాబూ వర్గీస్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, గోరేటి వెంకన్న, మౌనశ్రీ మల్లిక్, నిర్మాత: మహంకాళి శ్రీనివాసులు, దర్శకత్వం: నాగసాయి మాకం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments