బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ : కళ్యాణ్ రామ్ ఏం చేయబోతున్నాడో తెలుసా ?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది.కెరీర్ ఆరంభంలో అతనొక్కడే చిత్రంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత పరాజయాలు ఎదురయ్యాయి. తిరిగి పటాస్ చిత్రంతో బిగ్ హిట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత మరికొన్ని ప్లాపులు.. 118 తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఇక ఇలా కెరీర్ లో నెమ్మదిగా సాగితే కుదరదనుకున్నాడో ఏమో.. కళ్యాణ్ రామ్ ఓ భారీ చిత్రానికి రెడీ అయిపోయాడు. మే 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆ చిత్ర టైటిల్ రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. టైటిల్ తో పాటు సినిమా విశేషాలు కూడా తెలియనున్నాయి.
ఇదీ చదవండి: ఇంగ్లీష్ సహా ఐదు విదేశీ భాషల్లో RRR విడుదల
ఇప్పటికే పీఆర్వో సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారం మేరకు ఇది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రం. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఇది గేమ్ చేంజింగ్ మూవీ అవుతుందని తెలిపారు. గత ఏడాది నుంచి చిత్ర యూనిట్ సైలెంట్ గా షూటింగ్ జరుపుతోందట. మరో విశేషం ఏంటంటే.. తాజాగా ఓ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. చెడు నుంచి మంచి వైపు కాలంలో ప్రయాణం అని ఉంది.
దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇది టైం ట్రావెల్ కథాంశం తో తెరకెక్కుతున్న చిత్రం అని. బాలయ్య నటించిన టైం ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 ఓ మాస్టర్ పీస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఆసక్తి రేపుతున్న ఈ చిత్ర టైటిల్ మే 28న బయటకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments